ఫిజియోథెర‌పి స్టూడెంట్‌గా న‌య‌న‌తార‌

2019 Latest Telugu Movie News, Nayanthara to Play Physiotherapy Student Role, Nayanthara will be seen as a physiotherapy student in Vijay Bigil, Nayanthara character As Physiotherapy Student, Physiotherapy Student Role By Nayanthara, Nayanthara Ropped Interesting Role, Nayanthara Latest Movie News, Bigil Movie Latest updates, telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Nayanthara to Play Physiotherapy Student Role

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తున్న క‌థానాయిక‌ న‌య‌న‌తార‌. ఒక‌దానితో ఒక‌టి పొంత‌న లేని పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ లేడీ సూప‌ర్ స్టార్‌… ఇప్పుడు మ‌రో కొత్త త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తోంద‌ట‌. ఇంత‌కీ ఆ పాత్ర ఏమిటంటే… ఫిజియోథెర‌పి స్టూడెంట్‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే… విజ‌య్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో `బిగిల్‌` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ త‌మిళ చిత్రంలో విజ‌య్ ఫుట్‌బాల్ కోచ్‌గా క‌నిపించ‌నుండ‌గా… న‌య‌న్ ఫిజియోథెర‌పి స్టూడెంట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌. అయితే, న‌య‌న పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా… చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ని కోలీవుడ్ టాక్‌. ఎ.ఆర్‌.ర‌హ‌మాన్ సంగీత సార‌థ్యంలో రూపొందుతున్న `బిగిల్‌` ఈ ఏడాది దీపావ‌ళికి థియేట‌ర్లలోకి రానుంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో సంద‌డి చేయ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=wt61WGc5tH8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + fourteen =