హాకీ కోచ్‌గా మెగాస్టార్ చిరంజీవి?

2019 Latest Telugu Movie News, Megastar Chiranjeevi to Play Hockey Coach Role in Koratala Siva Movie, Hockey Coach Role By Chiranjeevi, Megastar Chiranjeevi and Koratala Siva Movie Latest News, Chiranjeevi to become Hockey Coach, Chiranjeevi Role In Koratala Film Revealed, Telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Megastar Chiranjeevi to Play Hockey Coach Role in Koratala Siva Movie
తాజాగా త‌న క‌ల‌ల ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి`ని పూర్తిచేసిన మెగాస్టార్ చిరంజీవి… ప్ర‌స్తుతం త‌న 152వ చిత్రంపై దృష్టి సారించారు. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించ‌నున్న‌ ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని ఆ మ‌ధ్య‌ వార్త‌లు వినిపించిన‌ సంగ‌తి తెలిసిందే. అంతేకాదు… రైతుగా, ఎన్నారైగా చిరు ఆ పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం… కొర‌టాల శివ సినిమాలో చిరు ద్విపాత్రాభిన‌యం చేయ‌డంలేద‌ని తెలిసింది. ఒక‌టే పాత్ర ఉంటుంద‌ని… అది కూడా హాకీ కోచ్ పాత్ర‌లో చిరు ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని టాక్‌. అలాగే పుష్క‌ర‌కాలం క్రితం షారుఖ్ ఖాన్ న‌టించిన హిందీ చిత్రం `చ‌క్ దే ఇండియా` త‌ర‌హాలో చిరు – కొర‌టాల శివ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. కాగా, `చ‌క్ దే ఇండియా`లో షారుఖ్ పాత్ర‌కి ప‌ర్స‌న‌ల్ లైఫ్ అంటూ ఏమీ ఉండ‌దు… కానీ శివ మాత్రం అందుకు భిన్నంగా చిరు పాత్ర చుట్టూ కుటుంబ భావోద్వేగాల‌ను అల్లుకున్న‌ట్లు స‌మాచారం. మ‌రి… ఈ వార్త‌ల్లో ఎంత నిజముందో త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో ప‌ట్టాలెక్క‌నున్న చిరు – కొర‌టాల మూవీ… వ‌చ్చే ఏడాది ఉగాదికి విడుద‌ల కానుంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=Q0WrJ6epCl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + eleven =