వాల్మీకి వివాదంపై హరీష్…రాముడు కూడా ఫైటింగ్ చేశాడు

2019 Telugu Full Movies, Harish Shankar Responds to Valmiki Movie Title Controversy, Harish Shankar clears Controversy over Valmiki, Harish Shankar Clarity About Valmiki, Harish Shankar Speaks About Varun tej Valmiki Controversy, Harish Shankar Valmiki lands in problem, Valmiki Movie Latest News, Valmiki Movie Title Trouble,telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Harish Shankar Responds to Valmiki Movie Title Controversy

హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ రీమేక్ వాల్మీకి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెుదటి సారి ఈసినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నెగెటివ్ షేడ్ లో కనిపిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమాలో వరుణ్ తేజ్ లుక్ ను రిలీజ్ చేయగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్కే ఇలా ఉంటే సినిమాలో వరుణ్ యాక్టింగ్ ఎలా ఉంటుందో అని అనుకున్నారు అందరూ. ఇక కర్నూల్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ఆ తరువాత ఆ తరువాత అనంతపురంలో చిత్రీకరణ జరుపుకుంటుండగా వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో ‘డీజే’లో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారంటూ అప్పట్లో బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఇష్యూపై అప్పట్లో పెద్ద దుమారమే నడిచింది. అన్ని అడ్డంకులను దాటుకుని హరీష్ శంకర్ ‘డీజే’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు గాను.. వాల్మీకి కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ సినిమాకు వాల్మీకి టైటిల్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘వాల్మీకి’ అనే గొప్ప వ్య‌క్తి పేరును హింసాత్మ‌క సినిమాకు ఎలా వాడుకుంటున్నారంటూ ఇది తమ మనోభావాలను దెబ్బతీయడమే అంటూ వాల్మీకి కులస్తులు నిరసన తెలుపుతున్నారు.

ఇక తాజాగా ఈ ఇష్యూపై తమ ట్విట్టర్ ద్వారా స్పందించాడు హరీష్ శంకర్. వాల్మీకి పూజించిన రాముడు కూడా ధర్మ కోసం ఫైటింగ్ చేశాడని.. ఏది ఏమైనా వాల్మీకి కమ్యూనిటీని మేము గౌరవిస్తామని తెలిపాడు. మరి ఈ టైటిల్ మార్చుతాడో.. మార్చడో అన్న విషయం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=0KommrPbWLo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + thirteen =