Elaa Elaga Full Video Song From Ashwamedham Movie Out Now
మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా అశ్వమేథం మూవీ లోని ఎలా ఎలాగ వీడియో సాంగ్ ఈ రోజు రిలీజయింది. నితిన్ G దర్శకత్వంలో ధృవ కరుణాకర్ , శివంగి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అశ్వమేథం రూపొందింది. సోన్యా, ప్రాచి, సుమన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ముంబై హీరోయిన్స్ టాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అశ్వమేథం మూవీ లో ముంబై బేస్డ్ ధృవ కరుణాకర్ హీరోగా నటించడం విశేషం.
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ స్వరకల్పన లో చరణ్ అర్జున్ రచించిన గీతాన్ని చరణ్ అర్జున్, హరిణి ఇవటూరి గానం చేసిన ఎలా ఎలాగ సాంగ్ ను మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ఈ రోజు రిలీజ్ చేసింది. అందమైన లొకేషన్స్ లో కలర్ ఫుల్ గా చిత్రీకరించిన ఎలా ఎలాగ సాంగ్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రియా నాయర్, వందన యాదవ్, ఐశ్వర్య యాదవ్ నిర్మించిన అశ్వమేథం మూవీ
ప్రేక్షకులను అలరించడానికి త్వరలో రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.