ఈ నెల 15 నుంచి అఖిల్‌4 రెగ్యుల‌ర్ షూటింగ్‌?

Akhil New Movie Regular Shoot To Begin Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Akhil Akkineni New Movie Regular Shoot To Begin Soon,Akhil Akkineni Upcoming Movie News,Akhil Akkineni Next Film Updates,Akhil Akkineni Next Film Updates,Akhil Akkineni Next Project Details,#AkhilAkkineni
అఖిల్ అక్కినేని క‌థానాయ‌కుడిగా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. కాగా, ఈ సినిమాకి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్‌ని గ‌త నెల 26 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం… క‌థానాయిక ఎంపిక‌లో జాప్యం జ‌ర‌గ‌డంతో… ఈ నెల 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టనున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే హీరోయిన్‌, రెగ్యుల‌ర్ షూటింగ్ డిటైల్స్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. గోపీసుంద‌ర్ సంగీత‌సార‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా… ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. ఈ సంవ‌త్స‌రాంతంలో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే దిశ‌గా ప్రణాళిక జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid= aAcKXkaG2BY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.