యువ కథానాయకుడు అక్కినేని అఖిల్, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు `బొమ్మరిల్లు` భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. కథానుసారం మేజర్ పార్ట్‌ను హైదరాబాద్‌లోనూ, కొంత భాగాన్ని విదేశాల్లోనూ తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్‌కు తల్లిగా నిన్నటి తరం నటీమణి ఆమని నటిస్తున్నట్టు సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్-2 పతాకంపై ‘బన్నీ’ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ స్పెషలిస్ట్ గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
[youtube_video videoid=Tmw3mEkzgbQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: