ప్రొఫైల్ పేరు మార్చుకుంటే గర్భవతేనా..?

Samantha Strong Counter to Rumors About her Pregnancy,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates 2019,Telugu Film News,Samantha takes a dig on pregnancy rumors,actor Samantha Akkineni rubbishing pregnancy rumours will leave you in splits instantly,Samantha Dismisses Pregnancy Rumours,Samantha Responds About Her Pregnancy Rumors
Samantha Strong Counter to Rumors about her Pregnancy

పెళ్లైన తరువాత కూడా మంచి సక్సెస్ జోష్ ను ఎంజాయ్ చేస్తూ.. చాలా సెలక్టివ్ గా స్టోరీలు ఎంపిక చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరంటే సమంత అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కైనా పెళ్లైన తరువాత కెరీర్ కాస్త స్లో అవుతుంది.. అదేం విచిత్రమో సామ్ కు మాత్రం అప్పుడు ఎలా ఉందో కెరీర్.. ఇప్పుడు కూడా అలానే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా ఎక్కువే. ఎప్పుడూ చలాకీగా ఉండే సమంత అప్పుడప్పుడు నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తుంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. అయితే ఇది నెటిజన్లకు కాదులెండి.. ఓ వెబ్ సైట్ కు. ఏంటీ సమంత తల్లి కాబోతుందా? అంటూ ఓ కథనం రాసుకొచ్చింది ఓ వెబ్ సైట్. ఇక దీనిపై స్పందించిన సామ్.. ‘అయ్యో.. అవునా.. ఆమె గర్భవతా?.. మీకు తెలిసినప్పుడు మాకు కూడా చెప్పండి’ అని ట్వీట్‌ చేశారు. ఇక సమంత రిప్లై చూసిన నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపించారు. సామ్‌ సూపర్‌గా సమాధానం చెప్పిందంటున్నారు.

ఇక దీనికి కారణం ఏంటంటే.. నందిని రెడ్డి దర్శకత్వంలో సామ్ ఓ బేబీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా జులై 5న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘ఓ బేబీ’ సినిమా ప్రచారంలో భాగంగా ఆమె ట్విటర్‌లో ‘సమంత అక్కినేని’గా ఉన్న తన పేరును ‘బేబీ అక్కినేని’గా మార్చుకున్నారు. దాంతో అయితే గత సినిమాల విడుదల సమయంలో ఆమె ఎప్పుడూ ఇలా ఖాతా పేరు మార్చలేదని, ఇప్పుడు మార్చడం వెనుక కారణం ఆమె గర్భవతి కావడమేనని ఊహిస్తూ కథనాలు రాసుకొచ్చారు. మరి ప్రొఫైల్ పేరు కూడా మార్చుకునే ఫ్రీడమ్ లేకుండా పోయింది పాపం సెలబ్రిటీలకు. ప్రొఫైల్ పేరు మార్చుకున్నంత మాత్రానా.. గర్భవతి అని రాసేయడమేనా..? మరి దీనికి సమంత స్ట్రాంగ్ రిప్లే ఇవ్వడంలో తప్పు లేదుగా..

కాగా ఇంకా ఈ సినిమాలో నాగశౌర్య, లక్ష్మి, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’కి తెలుగు రీమేక్ ఇది.

[subscribe]

[youtube_video videoid=Z6WlMvYEc3Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 10 =