బాల‌య్య‌కి జోడీగా ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్లు?

Two Crazy Heroines To Act With Balakrishna,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Film News,Balakrishna New Movie Heroines Confirmed,New Heroines To Act With Nandamuri Balakrishna,Balakrishna Upcoming Movie To Have 2 Heroines,Balakrishna Next With Two Crazy Heroines
Two Crazy Heroines To Act With Balakrishna

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా రూపొంద‌నున్న‌ విషయం తెలిసిందే. కె.ఎస్.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ ఈ పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించ‌నున్నాడు. ఇదిలా ఉంటే… గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తుండ‌గా… తాజాగా ది తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్‌. కామ్‌తో అవ‌న్నీ నిరాధార క‌థ‌నాలేన‌ని చిత్ర నిర్మాత‌ సి.కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు… త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చాడు. దీంతో… రూమ‌ర్ల‌కు చెక్ ప‌డింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… బాలకృష్ణ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా… ఆ పాత్రలలో ఆర్ ఎక్స్100 భామ పాయల్ రాజ్‌పుత్, ‘ఎఫ్ 2’ హీరోయిన్ మెహరీన్ నటించనున్నట్టు కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం… ఈ క్రేజీ హీరోయిన్లు దాదాపుగా క‌న్ఫ‌ర్మ్ అయినట్టు ఫిలింన‌గ‌ర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ఇద్దరి భామల ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడే అవ‌కాశ‌ముంది.చిరంతన్ భట్ స్వరాలు సమకూర్చ‌నున్న ఈ చిత్రం… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=ynUjuBYuKIY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 4 =