సరిలేరు నీకెవ్వరు మూవీతో రీ ఎంట్రీ

Vijayashanthi Re-Entry In Tollywood With Sarileru Neekevvaru,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijayashanthi is Back in TFI,Vijayashanthi Next in Mahesh Babu New Movie Sarileru Neekevvaru,Vijayashanthi Role in Mahesh Babu New Movie,Vijayashanthi Re-Entry With Mahesh Babu 26th Film
Vijayashanthi Re-Entry In Tollywood With Sarileru Neekevvaru

అనిల్ రావిపూడి దర్శకత్వంలో GMB ఎంటర్ టైన్ మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న కథా నాయిక. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ఫ్రెండ్ మదర్ క్యారెక్టర్ లో విజయశాంతి నటిస్తున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమర్షియల్ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందిన విజయశాంతి, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించడం ప్రారంభించారు. విజయశాంతి నటించిన కర్తవ్యం మూవీ ఘనవిజయం సాధించింది. కర్తవ్యం మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఒసేయ్ రాములమ్మా మూవీ లో అద్భుతం గా నటించిన విజయశాంతి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. 2006 సంవత్సరం నాయుడమ్మ సినిమాలో నటించిన విజయశాంతి తరువాత రాజకీయాలలో ప్రవేశించారు. 13 సంవత్సరాల తరువాత విజయశాంతి సరిలేరు నీకెవ్వరు మూవీ తో రీ ఎంట్రీ కావడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.