సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా.. సాయిపల్లవి, రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ఎన్టీకే. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఇక్కడ కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు నచ్చిందో..? సూర్య అభిమానులు పెట్టుకున్న అంచనాలను రీచ్ అయ్యాడో? లేదో? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : సూర్య, రకుల్ ప్రీత్, సాయి పల్లవి తదితరులు..
బ్యానర్: డ‌్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాత: ఎస్.ఆర్.ప్రభు (తమిళ్), కె.కె.రాధామోహన్ (తెలుగు)
రచన: దర్శకత్వం: సెల్వ రాఘవన్
సంగీతం: యువన్ శంకర రాజా
కథ
నంద గోపాల కృష్ణ (సూర్య) ఓ సామాన్యమైన రైతు. ఒక మామూలు రైతుగా తన భార్య సాయి పల్లవి మరియు ఇతర కుటుంబ సభ్యులతో జీవనం సాగిస్తూ గొప్ప స్థాయికి ఎదగాలని కలగంటూ ఉంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థుతుల వల్ల సూర్య రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది. ఒక కార్యకర్తగా మొదలై పార్టీలో బలమైన నాయకుడిగా సూర్య ఎలా ఎదగగలిగాడు? ఒక సామాన్య రైతు రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నించే క్రమంలో ఎదురైన చిక్కులేంటి? దుష్ట రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారు? ఈ కథకి రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్న సంబంధం ఏమిటి? అన్ని అడ్డంకులు నిలదొక్కుకొని సూర్య తాను అనుకున్నది సాధించాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఎన్నో కథలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక కొత్తదనం ఉంటే కానీ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టరు. ఇక సినిమాలో కూడా అలాంటి కొత్తదనం కోసమే చూశారు ప్రేక్షకులు. దీనికి కారణం సూర్య లాంటి విలక్షణ నటుడు హీరో కావడం… సెల్వరాఘవన్ డైరెక్షన్ కావడం వల్ల.. సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు రావడంతో ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు కొత్తగా అనిపించదు. కానీ రైతు నుండి పొలిటికల్ లీడర్ గా మారే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ కూడా ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.
ఇక హీరో సూర్య మరోసారి తన పెర్ఫామెన్సెస్ తో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు. అలాగే సూర్య భార్యగా సాయి పల్లవికి మంచి పాత్ర దక్కింది. మరో పవర్ ఫుల్ పొలిటిషన్ గా రకుల్ మంచి నటన కనబర్చారు. డబ్బింగ్ విలువలు బాగున్నాయి.యువన్ సంగీతం కూడా బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ ఆకట్టుకుంది.
ఈ సినిమాను మరో ప్రధానమైన బలం బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్. యువన్ శంకర్ రాజా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. . తిరగబడు అనే పాటను అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరా వర్క్ ఓకే.
ప్లస్ పాయింట్స్ :
*సూర్య నటన
*కొన్ని పొలిటికల్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్ :
*సెకండాఫ్
*కథనం
[wp-review id=”22755″]
[subscribe]
[youtube_video videoid=t5lkPlphLLQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: