దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు అన్నివిధాలా అర్హులు సూపర్ స్టార్ కృష్ణ

Super Star Krishna Is Eligible For Dadasaheb Phalke Award In All Ways,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Super Star Krishna Latest News,Super Star Krishna Eligible For Dadasaheb Phalke Award,Super Star Krishna Best Films,Super Star Krishna About Dadasaheb Phalke Award
Super Star Krishna Is Eligible For Dadasaheb Phalke Award In All Ways

మే 31 – సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ నటశేఖరుడి సుదీర్ఘ చలనచిత్ర జీవిత విశేషాలను ఆవిష్కరిస్తూ ప్రత్యేక కథనాలు రాస్తుంది మీడియా. అయితే ఈ అభినందన వ్యాసాలు ఆయన నటించిన సినిమాల జాబితాకు, ఆయన పక్కన నటించిన హీరోయిన్ల లిస్టుకు పరిమితం కాకూడదు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

54 ఏళ్ల సుదీర్ఘ చలనచిత్ర జీవిత ప్రస్థానంలో తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవల విలువను, విశిష్టతను ఆవిష్కరించేలా ఉండాలి ఆ ప్రత్యేక కథనాలు. అలాంటిదే ఈ అక్షర అభినందన.

1965 – మార్చి 31న విడుదలైన “తేనె మనసులు” చిత్రంతో  పరిచయమైన కృష్ణ అతి తక్కువ కాలంలోనే తెలుగువారికి అత్యంత సన్నిహితమయ్యారు.65 లో తేనె మనసులు, కన్నె మనసులు, 66 లో గూడచారి 116   – ఇలా రెండేళ్లలో 3 చిత్రాలకు మాత్రమే పరిమితమైన కృష్ణ 67 నుండి ఉత్తుంగ తరంగంలా విజృంభించారు.1967లో కృష్ణ నటించిన 7 చిత్రాలు విడుదల కాగా 68 లో 11, 69 ,70 సంవత్సరాలలో 15 చిత్రాల చొప్పున విడుదలయ్యాయి. ఇక ఆ తర్వాత 1989 వరకు  సంవత్సరానికి సగటున 10 నుండి 12 చిత్రాలకు తక్కువ చేసిన సందర్భాలు లేవు. 1972- 1980 సంవత్సరాలలో సంవత్సరానికి 18 చిత్రాల చొప్పున నటించి  స్టార్ హీరోలలో హైయెస్ట్ ప్రొడక్టివిటీని అందించిన హార్డ్ వర్కింగ్ స్టార్ గా చరిత్ర సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ. 1967 నుండి 1990 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎటు చూసినా , ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా సూపర్ స్టార్ కృష్ణ పోస్టర్లు దర్శనమిచ్చేవి. ఆనాటి పిల్లలు, కాలేజీ యూత్, పెద్దలు అందరికీ బాల్య స్మృతులుగా, గొప్ప జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి
కృష్ణ పోస్టర్స్, సినిమాలు, పాటలు, సాహసాలు. ప్రపంచ  చలనచిత్ర చరిత్రలో ఏ హీరో నుండి ఏ చిత్ర పరిశ్రమకు అందనంత ఉత్పాదకతను తెలుగు చిత్ర పరిశ్రమకు కృష్ణ అందించారు అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. పగలు రేయికి తేడా లేకుండా రోజుకు మూడు నాలుగు షిఫ్ట్ ల చొప్పున పనిచేసి నమ్ముకున్న నిర్మాతలకు లాభాల పంటను, సాంకేతిక నిపుణులకు జీవన  భృతిని అందించిన గొప్ప ‘శ్రమజీవి’ సూపర్ స్టార్ కృష్ణ. 


కేవలం నటనకే పరిమితం అవ్వకుండా నిర్మాతగా మారి కృష్ణ నిర్మించిన చిత్రాలు, అవి సాధించిన విజయాలు, అవి సృష్టించిన సంచలనాలు తెలుగు వారి మనసుల్లో శాశ్విత చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోయాయి. ఉత్తరాదిన అద్భుత విజయాలు సాధించిన దక్షిణాది చిత్ర నిర్మాణ సంస్థలు , దర్శక నిర్మాతలు చాలా మంది ఉన్నప్పటికీ పద్మాలయా సంస్థ స్థాపన ద్వారా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి కృష్ణ తెచ్చిన గుర్తింపు, గౌరవం అనితర సాధ్యం. సౌత్ ఇండియా అంటే ముఖ్యంగా తెలుగు సినిమా అంటే బాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ ఆయన నెలకొల్పిన పద్మాలయా సంస్థ. ఇలా నటుడిగా, నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా అద్భుత విజయాలు సాధించిన కృష్ణ సరికొత్త సాంకేతిక విప్లవాల పరిచయ కర్త కూడా చరిత్రలో నిలిచిపోయారు. సినిమా స్కోప్, 70 ఎం.ఎం., dts, వంటి ఎన్నెన్నో సాంకేతిక ప్రక్రియలను పరిచయం చేసిన సాహసాల సహవాసి కృష్ణ. ఇక జోనర్స్ విషయానికి వస్తే కృష్ణ టచ్ చేయని జోనర్ ఏదీ లేదు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, కౌ బాయ్, క్రైమ్ థ్రిల్లర్స్ వంటి అన్ని జోనర్ ఫిలిమ్స్ చేసి అద్భుత విజయాలు సాధించిన ఆల్ టైం “ఆల్ రౌండర్” సూపర్ స్టార్ కృష్ణ.


25 సార్లు ద్విపాత్రాభినయం, ఏడు సార్లు త్రిపాత్రాభినయం చేయటమే కాకుండా ప్రపంచంలో అత్యధిక చిత్రాల కథానాయకుడిగా చరిత్ర సృష్టించారు కృష్ణ. ఈ రికార్డ్ విషయంలో ఒకప్పటి మళయాల స్టార్ ప్రేమ్ నజీర్ అత్యధిక చిత్రాల హీరో అని చెప్తుంటారు. కానీ ఆయన ప్రారంభ దశలో చేసిన చిత్రాలలో అధిక శాతం సహాయక పాత్రలు, సెకండ్ హీరో పాత్రలు మాత్రమే చేశారు. కానీ తొలి చిత్రం మొదలుకొని 340కి పైగా చిత్రాలలో హీరోగా చేసిన ఘనత ఒక సూపర్ స్టార్ కృష్ణ కే దక్కుతుంది. అలాగే ఒకే హీరోయిన్ తో 48 చిత్రాలు చేయడం కూడా సూపర్ స్టార్ కృష్ణ పేరున ఉన్న అరుదైన రికార్డు. అది కూడా తన సతీమణి అయిన హీరోయిన్ తో చేయటం విశేషం. శ్రీమతి విజయ నిర్మల హీరోయిన్ గా కృష్ణ 48 చిత్రాలు చేశారు. ఆ తరువాత జయప్రద హీరోయిన్ గా 47 చిత్రాలు చేశారు. ఇక స్నేహ ధర్మం కోసం , మొహమాటం కోసం 25కు పైగా చిత్రాలలో గెస్ట్ పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు కూడా కృష్ణ పేరిటే ఉంది.

ఇలా 340 పైగా చిత్రాల కథానాయకునిగా, 17 చిత్రాల దర్శకుడిగా, 70కి పైగా చిత్రాల నిర్మాతగా, కథకుడిగా, ఎడిటర్ గా, వినూత్న సాంకేతిక  ప్రక్రియల పరిచయ కర్తగా సూపర్ స్టార్ కృష్ణ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి అందించిన సేవలు అనితర సాధ్యం… ఆయనకే సాధ్యం.

మహేష్ బాబు లాంటి మరొక సూపర్ స్టార్ ను తన నట వారసుడిగా అందించటాన్ని కూడా కృష్ణ కాంట్రిబ్యూషన్స్ లో ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ గా చెప్పుకోవాలి.

కేవలం వృత్తి పరమైన జీవితంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మనసున్న మంచి మనిషిగా, మానవతా పరిమళాల సహృదయ సమ్రాట్ గా తెలుగు వారి హృదయాలలో నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాభినందనలు పలుకుతోంది” తెలుగు ఫిలిం నగర్ టాక్”.

ఈ సందర్భంగా భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అన్ని విధాలా అర్హులు పద్మభూషణ్ సూపర్ స్టార్ డాక్టర్ కృష్ణ అన్న విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించాలి…  ఆ  అవార్డుకు అన్ని విధాల అర్హులైన కృష్ణ ను ఆ హైయ్యస్ట్ అవార్డ్ తో సత్కరించాలి. ఇది కేవలం కృష్ణ అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ అభిలాష మాత్రమే కాదు…. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ పేరును ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ప్రతిపాదిస్తూ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపి ఆ దిశగా కృషి చేయవలసిన అవసరం ఉంది.  పద్మ అవార్డులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన కూడా వెలువడుతుంది కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఈ విషయాన్ని తక్షణ కర్తవ్యంగా భావిస్తారని ఆశిద్దాం… 

[subscribe]

[youtube_video videoid=nRvursApoPw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 3 =