సాహో నుండి మరొక పోస్టర్ రిలీజ్

Saaho Movie New Poster Unveiled,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas Shares New Poster Of Saaho,Prabhas New Look From Saaho,Saaho New Poster Revealed,Saaho Movie Latest Updates
Saaho Movie New Poster Unveiled

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా కనిపించనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎప్పుడో ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో ప్రభాస్ బర్త్ డే కి, శ్రద్ధా కపూర్ బర్త్ డే కి రెండు వీడియోలను రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అంతకు మించి ఈ సినిమా అప్ డేట్స్ కూడా పెద్దగా ఇవ్వలేదు చిత్రయూనిట్. దీంతో అభిమానులు కూడా ఈ సినిమా నుండి కొత్త అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్, ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. బైక్ పై ప్రభాస్ దూసుకెళ్లే ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమాలో బైక్ ఛేజింగ్ సీన్స్ భారీగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే ప్రచారం మొదటి నుంచి సాగుతూనే వుంది. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తుంటే అది నిజమనే అనిపిస్తుంది. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ ప్రభాస్ కు కలిసొస్తుందో..!

[subscribe]
[youtube_video videoid=Z6WlMvYEc3Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + fourteen =