మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ సినిమాల స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని టాక్. జూన్ నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో సాయితేజ్‌కి జోడీగా అవికా గోర్ నటించనుందని ఫిల్మ్‌నగర్ ఇన్‌ఫర్మేషన్. హిందీ అనువాద ధారావాహిక చిన్నారి పెళ్ళికూతురు
ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన అవికా… ఉయ్యాలా జంపాలా
తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తరువాత సినిమా చూపిస్త మావ
తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా
(2016) తరువాత మళ్ళీ తెరపై కనిపించని ఈ టాలెంటెడ్ బ్యూటీ… మళ్ళీ మూడేళ్ళ తరువాత సాయి తేజ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందన్నమాట. త్వరలోనే అవికా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
[youtube_video videoid=QvSP5gJkKg0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: