కార్తికేయ సీక్వెల్ లో మరోసారి జంటగా నిఖిల్, స్వాతి

Nikhil Siddharth and Swathi to Repeat in Karthikeya Sequel,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nikhil Siddharth and Swathi Combo is Back,Nikhil Siddharth and Swathi to Team Up For Next,Nikhil Siddharth and Swathi To Work Again For Karthikeya Sequel,Karthikeya Sequel Movie Latest Updates,Nikhil Siddharth To Pair Up With Swathi for the Second Time
Nikhil Siddharth and Swathi to Repeat in Karthikeya Sequel

చందు మొండేటి దర్శకత్వం లో నిఖిల్, స్వాతి జంటగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ మూవీ 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ కార్తికేయ 2 మూవీ రూపొందనుంది. కార్తీకేయ 2 మూవీ స్వాతి కి మాత్రమే కమ్ బ్యాక్ మూవీ కాదని, కార్తికేయ టీమ్ కే కమ్ బ్యాక్ మూవీ అని నిఖిల్ అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో స్వాతి తో కలసి మరోసారి కార్తికేయ 2 మూవీ లో నటించడం థ్రిల్లింగ్ గా ఉందని నిఖిల్ అన్నారు. కార్తికేయ మూవీ లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో, ఆ క్యారెక్టర్స్ అన్నీ ఈ సీక్వెల్ లో ఉంటాయని, మరో నటి కూడా ఉంటారని అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుండి సీక్వెల్ మూవీ ప్రారంభమవుతుందని, మే నెలాఖరులో కార్తికేయ 2 షూటింగ్ ప్రారంభమవుతుందని నిఖిల్ తెలిపారు. అర్జున్ సురవరం మూవీ కై సన్నబడ్డానని, కార్తికేయ 2 మూవీ లో సిక్స్ ప్యాక్ అబ్స్ తో కనిపిస్తానని, ఈ మూవీ లో ఫైట్ సీన్స్ చాలా ఉన్నాయని, కార్తికేయ మూవీ లో దర్శకుడు చందు తన బాడీ చూపించలేదని, ఈ మూవీ లో అయినా తన సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తారని అనుకుంటున్నానని నిఖిల్ నవ్వుతూ చెప్పారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందనున్నదని, తెలుగు తో పాటు హిందీ, మలయాళ భాషలలో ఈ మూవీ రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ అన్నారు.

[subscribe]


[youtube_video videoid=fRupxGaQ094]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =