‘జెర్సీ’ రీమేక్ కోసం ప్ర‌ముఖ‌ నిర్మాత‌ల ప్ర‌య‌త్నాలు

Star Producers Trying Hard For Jersey Movie Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Jersey Movie Remake,Star Producers are Planning For Jersey Remake,Jersey Movie Remake Latest Updates,Remake of Jersey Movie
Star Producers Trying Hard For Jersey Movie Remake

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామాని… టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందించాడు. క్రికెట్, తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం… స‌గ‌టు ప్రేక్షకుల‌ నుంచి సినీ ప్రముఖుల వరకు అంద‌రి ప్రశంసలను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో… ఈ సినిమాను రీమేక్ చేయాలని ప‌లువురు స్టార్ ప్రొడ్యూస‌ర్స్ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న ‘దిల్’ రాజు… ఎప్పటినుంచో బాలీవుడ్‌లో కూడా త‌న‌దైన ముద్ర‌ వేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడాది తెలుగులో తొలి బ్లాక్ బస్టర్ మూవీ అయిన‌ ‘ఎఫ్-2’ రీమేక్‌తో తన బాలీవుడ్ ఎంట్రీకి ప్రణాళికలు రచిస్తున్నాడాయ‌న‌. అంతేకాదు… రెండో ప్రయత్నంగా నాని నటించిన ‘జెర్సీ’ని కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా… బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క‌మ్‌ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ‘జెర్సీ’ మూవీని చూడడానికి సిద్ధపడినట్లు సమాచారం. మరోవైపు కోలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా ‘జెర్సీ’ రీమేక్ విష‌యంలో ఆసక్తిని కనబరుస్తున్నట్లు వినికిడి. మ‌రి… ఈ రీమేక్‌ల‌ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే ఇంకొంతకాలం వేచి ఉండాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=bxDtIMt66js]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =