పోటా పోటీగా జెర్సీ, కాంచన3 కలెక్షన్లు

Jersey And Kanchana 3 Movie Latest Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey And Kanchana 3 Movie Box Office Collections,Nani Jersey Movie WorldWide Collections,Kanchana 3 Telugu Movie Collections,Jersey Verses Kanchana 3 Collections
Jersey And Kanchana 3 Movie Latest Collections

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏప్రిల్ నెల టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. గత కొద్ది రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు సూపర్ హిట్స్ అందించాయి. ఇక డబ్బింగ్ సినిమా కాంచన 3 కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు రెండు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఆ సినిమాలు జెర్సీ, కాంచన3. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజై కలెక్షన్లు రాబట్టడంలో పోటా పోటీగా ఉన్నాయి. ముఖ్యంగా బి. సి సెంటర్లలో ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నాయి.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన జెర్సీ సినిమా ఈనెల 19న రిలీజై సూపర్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమా తీసిన గౌతమ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్ల విషయానికొస్తే మొదటి మూడు రోజుల్లోనే దాదాపు చాాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా.

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వేదిక, ఓవియా ముఖ్య పాత్రల్లో ముని సిరీస్ లో భాగంగా హారర్ కామిక్ థ్రిల్లర్ గా వచ్చిన కాంచన 3 కు కూడా మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా జెర్సీ సినిమా కలెక్షన్లతో పాటు పోటీ పడుతుండటం.

ఆదివారం కృష్ణా జిల్లాలో జెర్సీ 23.03 లక్షల షేర్ ని రాబట్టగా.. మొదటి మూడు రోజులకుగానూ రూ. 76.79 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో వైపు కాంచన 3 కూడా ఆదివారం నాడు 22.69 లక్షల షేర్ ను సాధించింది. ఈ చిత్రం మూడు రోజులకుగానూ రూ. 69.20 లక్షల షేర్ ను రాబట్టింది.

ఇక జెర్సీ నాలుగవ రోజు కృష్ణా లో 10, 83,840 షేర్ తో 4రోజుల్లో అక్కడ 87,63, 114 షేర్ ను కలెక్ట్ చేయగా కాంచన 3 నాలుగో రోజు కృష్ణా లో 9,75,014 షేర్ ను రాబట్టి 4రోజుల్లో 79,02,558 షేర్ ను కలెక్ట్ చేసింది.

మొత్తానికి డబ్బింగ్ సినిమా అయినా కూడా.. అది కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న జెర్సీ సినిమాతో పాటుగా కలెక్షన్స్ రాబట్టడం గ్రేటే. మరి చూద్దాం ఈ రెండు సినిమాల కలెక్షన్ల ప్రభంజనం ఎంతవరకూ కొనసాగుతుంది.

[subscribe]


[youtube_video videoid=OA9UJoV8eBk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eight =