మ‌హేష్ చిత్రంలో విజ‌య‌శాంతి పాత్ర అదేనా…?

Vijayshanthi Role Revealed in Mahesh babu New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh babu New Movie Updates,Vijayshanthi in Mahesh Babu Next Film,Vijayshanthi Role in Mahesh Babu Upcoming Movie,Vijayshanthi and Mahesh Babu to Team Up For New Movie,Vijayshanthi To Work With Super Star Mahesh Babu
Vijayshanthi Role Revealed in Mahesh babu New Movie

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… సినీ ప్రియుల‌కు పరిచయం చేయ‌న‌క్కర్లేని పేరు. ప‌లు వైవిధ్యభ‌రిత‌మైన పాత్రల్లో క‌నిపించ‌డ‌మే కాకుండా… తన అస‌మాన అభిన‌యంతో అల‌రించిన నిన్న‌టి త‌రం కథానాయిక. గ‌త కొంత‌కాలంగా క్రియాశీల‌క రాజ‌కీయాల‌తో బిజీ అయిపోయిన విజ‌య‌శాంతి… సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నార‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రానున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో… క‌థానాయ‌కుడి పాత్ర‌కి ధీటుగా ఉండే పాత్ర‌లో విజయశాంతి ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ని టాక్‌. హిలేరియ‌స్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ సినిమాలో… విజ‌య‌శాంతి పాత్ర చాలా కీల‌కంగా, అంత‌కంటే భిన్నంగా ఉంటుందనీ తెలుస్తోంది. అంతేకాదు… సమాజ శ్రేయ‌స్సు కోసం ప‌రిత‌పించే ఓ స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి గృహిణి పాత్ర‌లో ఆమె కనిపిస్తుందట. తన రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండడంతో పాటు… నటించ‌డానికి కూడా మంచి స్కోప్ ఉన్న పాత్ర కావ‌డంతో… విజ‌య‌శాంతి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ‘కొడుకు దిద్దిన కాపురం’ త‌ర్వాత… దాదాపు మూడు ద‌శాబ్దాల అనంత‌రం విజ‌య‌శాంతి, మ‌హేష్ మ‌రోసారి వెండితెర‌పై క‌నిపించ‌నుండ‌డం ఆస‌క్తిని పెంచే వార్తే అవుతుంది. ఏదేమైనా విజ‌య‌శాంతి ఎంట్రీపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.

కాగా… జూన్‌లో ప్రారంభం కానున్న మ‌హేష్‌, అనిల్ చిత్రం… 2020 సంక్రాంతికి తెర‌పైకి రానుంది. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని టాక్‌.

[subscribe]


[youtube_video videoid=YrZcvDp7SXk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 11 =