నాగ్ కు అచ్చి వచ్చిన ఏప్రిల్ 5 చైతు కు కూడా అచ్చి వచ్చింది

2019 Latest Telugu Movie News, April 5th Sentiment For Nagarjuna and Naga Chaitanya, Naga Chaitanya New Movie Updates, Nagarjuna Lucky Date Turns for Naga Chaitanya, Nagarjuna Lucky Date Turns Out Lucky for Naga Chaitanya as Well, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Nagarjuna Lucky Date Turns Out Lucky for Naga Chaitanya as Well

తండ్రి కొడుకుల “గుడ్ లక్ డే” ఒకటే కావటం చాలా అరుదుగా జరిగే విశేషం.19 సంవత్సరాల క్రితం హీరో నాగార్జునకు అచ్చి వచ్చిన ఏప్రిల్ 5
ఇన్నేళ్ల తరువాత మరలా ఆయన కుమారుడు నాగచైతన్యకు అచ్చి రావటం చెప్పుకోదగ్గ విశేషం. ఆ వివరాలు ఏమిటో  చూద్దాం. “అన్నమయ్య” వంటి అద్భుత, ఆధ్యాత్మిక చిత్రంలో నటించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత హీరో నాగార్జునకు విజయాలు కరువయ్యాయి. అన్నమయ్య తరువాత వచ్చిన “రక్షకుడు” పెద్ద ప్లాప్. ఆ తరువాత వచ్చిన “ఆవిడ మా ఆవిడే” యావరేజ్. దాని తరువాత వచ్చిన “ఆటో డ్రైవర్, చంద్రలేఖ” ఫెయిల్ అయ్యాయి. తర్వాత “సీతారామరాజు” ఒక మోస్తరు విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన “రావోయి చందమామ” ఫెయిల్ అయింది. ఇలా వరుస పరాజయాలతో నాగార్జున కెరీర్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సందర్భంలో 2000 వ సంవత్సరం ఏప్రిల్ 5న విడుదలైన “నువ్వు వస్తావని” అద్భుత విజయాన్ని సాధించగా నాగార్జున తిరిగి ఫామ్ లోకి వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది 19 సంవత్సరాల క్రితం నాటి ఫ్లాష్ బ్యాక్.  కాగా ప్రస్తుతానికి వస్తే నాగార్జున తనయుడు నాగ చైతన్య కెరీర్ లో కూడా ఇలాంటి సందర్భం పునరావృతం కావడం విశేషం.2017 లో వచ్చిన ” రారండోయ్ వేడుక చూద్దాం” నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఆ తరువాత వచ్చిన “యుద్ధం శరణం” డిజాస్టర్ కాగా దాని ఫాలోఅప్ గా వచ్చిన” శైలజా రెడ్డి అల్లుడు” ఒక మోస్తరు విజయం గా నిలిచింది. ఆ పై వచ్చిన” సవ్యసాచి” బాగా డిజప్పాయింట్ చేసింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో కొంచెం డల్ అయిన నాగ చైతన్య కెరీర్ ను మరలా ఫామ్ లోకి తెచ్చింది ఈ రోజు విడుదలైన “మజిలీ “. అంటే 19 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 5న తండ్రి నాగార్జునను వరించిన సక్సెస్ ఇప్పుడు కొడుకు నాగచైతన్యను వరించింది అన్నమాట . నిజానికి ఇదొక యాదృచ్చిక విశేషం అనే చెప్పుకోవాలి.

[subscribe]

[youtube_video videoid=msJBVpEm2ZE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 6 =