మెగా బ్రదర్స్ కు సపోర్ట్ గా అల్లు అర్జున్

Allu Arjun Extends Support to Pawan Kalyan and Janasena,2019 Latest Telugu Movie News,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News,Allu Arjun Support to Pawan Kalyan,Stylish Star Allu Arjun Extends Support to Janasena Party,Allu Arjun Announces His Support for Janasena

ఏపీలో సమ్మర్ వేడి కంటే ప్రస్తుతం రాజకీయ వేడి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ వేడి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. 2014లో టీడీపీ, వైసీపీ మధ్య పోరు ఉండగా.. ఈసారి మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ ఉండబోతుంది. ఇక ఎవరి ప్రచారంలో వాళ్లు బిజీ బిజీగా ఉండగా.. జనసేన పార్టీ తరుపున నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా నిలిచిన నాగబాబు కూడా తమ ప్రచారంలో తాను బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాగబాబు ప్రచారంలో తనయ నిహారిక కూడా పాల్గొంటుండగా.. అల్లు అర్జున్, వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ నాగబాబుకు సపోర్టు ఇస్తున్నట్టు ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినందుకు చాలా సంతోషం మేము మీతో భౌతికంగా లేకపోయినా కూడా.. మా సపోర్ట్ ఎప్పుడూ మీకే ఉంటుందని లేఖలో చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారికి కూడా నా విషెస్ చెబుతున్నాను.. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు.

[subscribe]

[youtube_video videoid=pmOahJhbbrU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − one =