కోలీవుడ్ స్టార్ సూర్య ఈ ఏడాది రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు. శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న `ఎన్జీకే` మే 31న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా…. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కాప్పాన్` వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 30న తెరపైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ రెండు సినిమాలు విడుదలయ్యేలోపే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నాడు సూర్య. ఆ వివరాల్లోకి వెళితే… విక్టరీ వెంకటేష్ `గురు` చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర డైరెక్షన్‌లో సూర్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయని సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రకాష్ ట్యూన్స్ అందించే పనిలో బిజీగా ఉన్నాడు. మరి… `గురు` దర్శకురాలితో సూర్య చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: