అన్ని సమయాలలోనూ, అన్ని విషయాలలోనూ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. ముఖ్యంగా సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో
అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతాయి అనుకోవటం అత్యాశే అవుతుంది. అందుకే ఇక్కడ అప్పుడప్పుడు అనుకున్న కార్యక్రమాలు అనుకోకుండా వాయిదా పడుతుంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహేష్ 25″ వర్కింగ్ టైటిల్ గా ” మహర్షి” ప్రకటిత టైటిల్ గా నిర్మితమవుతున్న మహేష్ బాబు తాజా చిత్రం ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మొదట ప్రకటించారు నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు. ఆ తరువాత అది ఏప్రిల్ 25 కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ కార్యక్రమాల మీద మీడియా లో రకరకాల కథనాలు, భిన్నాభిప్రాయాలు వినిపించాయి. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా, ప్రాజెక్ట్ క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా జరుగుతున్న కొన్ని అనుచిత ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఈరోజు నిర్మాత దిల్ రాజు తన కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు.
ఈ ప్రెస్ మీట్ లో ‘మహర్షి’ చిత్ర నిర్మాణ విశేషాలను తెలియజేస్తూ “మార్చి 17 తో “మహర్షి” టాకీ పార్ట్ పూర్తవుతుంది. రెండు పాటలు, ప్యాచ్ వర్కు మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారానికి షూటింగ్ పార్ట్ పూర్తి చేసి “మహర్షి”ని మే 9వ తేదీన విడుదల చేస్తున్నాం” అని ప్రకటించారు.
” మా నిర్మాతలలో ఒకరైన అశ్వని దత్ గారు తను నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి చిత్రాలను మే 9న విడుదల చేసి అద్భుత విజయాలను సాధించారు. సెంటిమెంటల్ గా అచ్చి వచ్చిన ఆ డేట్ కే ” మహర్షి” చిత్రాన్ని విడుదల చేస్తున్నాం”- అని ప్రకటించారు దిల్ రాజు.
దీనితో మహర్షి చిత్రనిర్మాణ వివరాలు, విశేషాల పై మీడియాలోనూ తద్వారా అభిమానుల్లోనూ ఏర్పడిన అనుమానాలకు, అపోహలకు ముగింపు పలికారు నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు అండ్ పొట్లూరి వి ప్రసాద్.
[youtube_video videoid=r28-ORF728c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: