కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఎన్నో వాయిదాలు, సెన్సార్ ఆలస్యాల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జులై 23, 2026 నాడే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురానున్నారు. విజయ్ చివరి చిత్రం కావడం అందులోనూ ప్రస్తుతం ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉండటంతో ఈసినిమాకు ఊహించని రీతిలో ఓపెనింగ్స్ రానున్నాయి. తెలుగులోనూ ఈసినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కనున్నాయి.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మమితా బైజు, ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























