పాక్ ప్రధాని పై వర్మ ట్వీట్ల అటాక్

#RGV, 2019 Latest Telugu Movies News, Ram Gopal Varma Funny Comments on Pakistan Prime Minister, Ram Gopal Varma Verbal Attack On Pakistan Prime Minister, RGV Response on Pakistan PM Imran Khan, RGV Sarcastic Comments on Pakistan Prime Minister, RGV Tweets on Pakistan PM Imran Khan, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
RGV Tweets on Pakistan PM Imran Khan

నిన్నటి వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ట్వీట్లు చేస్తూ సంచలనం సృష్టించిన వర్మ ఈరోజు పాక్ ప్రధానిపై ట్వీట్లతో అటాక్ చేశాడు. పుల్వామా ఘటనలో ఎంతో మంది జవాన్లు మరణించగా దేశం మొత్తం పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పాక్ పై ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా అని ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. పుల్వామా ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కూర్చొని మాట్లాడుకునే సమస్య అని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఈ సంఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు.. మాటలతో సమస్యలు పరిష్కారమైపోతే మీరు మూడు సార్లు పెళ్లి చేసుకునే అవసరమే వచ్చి ఉండేది కాదు’ అని ట్వీట్ చేసిన వర్మ అక్కడి నుంచి వరసపెట్టి ట్వీట్ల బాణాలు ఎక్కుపెట్టారు.

* ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని అమెరికాకు తెలుస్తోంది. కానీ మీకు తెలియదు. అసలు పాకిస్థాన్ ఒక దేశమేనా ? చెప్పండి సార్..ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్నాడు.మాకు కొంచెం తెలివితేటలు ఇవ్వండి అంటూ ట్వీట్ చేసాడు.

జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తొయిబా, తాలిబన్, అల్ ఖైదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరు చెప్పలేదు. కానీ మీకు వాటిపై ప్రేమ లేదన్న విషయాన్ని అంగీకరించలేదన్నాడు.  

జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తొయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీరు బంతులుగా భావించి..పాకిస్థాన్ బౌండరీలు దాటిస్తూ..ఇండియా పెవిలియన్‌కు పంపుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా ? లేదా బాంబ్స్ అనుకుంటన్నారా లేదా చెప్పండి సార్.

ఇక వర్మ ఏ ట్వీట్ చేసిన వైరల్ అవ్వడం కామనే కదా.. అలా ఇమ్రాన్ ఖాన్ పై చేసిన ట్వీట్లు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి వర్మ చేసిన ట్వీట్లు ఏంటో మీరు కూడా చూడండి..

 

 

 

 

 

[subscribe]

[youtube_video videoid=Os0l5lTs9rA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =