విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈసినిమాను అటు తమిళ్ లోనూ.. హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా.. సందీప్ వంగా దర్శకత్వంలో కబీర్ సింగ్ గా తెరకెక్కుతున్న ఈ రీమేక్ గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తమిళ్ రీమేక్ కు మాత్రం ఇబ్బందులు వచ్చి పడ్డాయి. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అనుకున్న అవుట్ పుట్ ఇవ్వని నేపథ్యంలో సినిమాను మళ్లీ రీషూట్ చేస్తున్నామని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అనుకున్నదే తడవుగా.. తెలుగు అర్జున్ రెడ్డి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం లో రీ షూట్ స్టార్ట్ చేశారు.టైటిల్ కూడా వర్మ ను తీసేసి ఆదిత్య వర్మ గా మార్చారు. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ నటి బానిత సంధు ను ఎంపిక చేశారు. హీరోయిన్ ప్రియా ఆనంద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ రెడ్డికి సంగీతం అందించిన రధాన్ ఈ సినిమా కు కూడా సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. అదేంటంటే.. ఈసినిమా రీమేక్ లో ఒరిజినల్ అర్జున్ రెడ్డి అదే.. విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ వల్ల సినిమాకు ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ఓ అతిథి పాత్రలో తాను నటించినా చాలు సినిమాకు కావాల్సినంత హైప్ వస్తుందని చిత్రయూనిట్ భావిస్తుందట. అయితే దీనిపై అధికారికి ప్రకటన వచ్చేంతవరకూ ఏం చెప్పలేం. మరి నిజంగానే విజయ్ అలా వచ్చి కనపడినా చాలు సినిమాకు రావాల్సిన క్రేజ్ వచ్చేస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.
[youtube_video videoid=EVrgWqwbdIE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: