`గీత గోవిందం` వంటి సంచలన విజయం తరువాత యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందణ్ణ జంటగా నటిస్తున్న చిత్రం `డియర్ కామ్రేడ్`. నూతన దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు బిగ్ బెన్ బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే… ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కాకినాడ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో… తాజా షెడ్యూల్‌ని ఫిబ్రవరి 5 నుండి హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో క్రికెటర్ రోల్‌లో నటిస్తున్న రష్మికపై కొన్ని క్రికెట్ నేపథ్య సన్నివేశాలను ప్లాన్ చేసిందట యూనిట్. దీంతో… సింహభాగం చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. ఆ తరువాత ఏకధాటిగా షెడ్యూల్స్ జరిపి… వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`గీత గోవిందం` తరువాత విజయ్, రష్మిక కలసి నటిస్తున్న చిత్రం కావడం… అలాగే గత ఏడాది `మహానటి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాలతో విజయ్ ఘనవిజయాలు నమోదు చేసుకోవడంతో… `డియర్ కామ్రేడ్`పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి… ఈ సినిమాతో కథానాయకుడిగా విజయ్ స్థాయి మరింతగా పెరుగుతుందేమో చూడాలి.
[youtube_video videoid=u0f3s5QJZg8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: