బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇటీవలే రెండవ షెడ్యూల్ ను ప్రారంభించింది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో నటుడు కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ కన్ఫామ్ అని చెప్పడం కష్టమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు.. అతి తర్వలో ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల గురించి కూడా ప్రకటించనున్నారని సమాచారం.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: