హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ `F2`. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాని ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే జ్యూక్ బాక్స్ విడుదల చేయగా పాటలకు మంచి రెస్పాన్సే వస్తుంది. ఇప్పుడు తాజాగా మరో పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఎంతో ఫన్ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి సంక్రాంతి అల్లుళ్లు చేసే సందడి చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.
[youtube_video videoid=kzdU33jBpbA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: