క్రిష్ దర్శకత్వంలో మహానటుడు నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలకృష్ణ నటిస్తుండగా..అలనాటి స్టార్ హీరోలు..హీరోయిన్ల పాత్రల్లో ఈనాటి స్టార్ హీరోలు..హీరోయిన్లు నటిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’జనవరి 9న విడుదల కానుంది. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్‌ని పొందింది. 2 గంటల యాభై నిమిషాల నిడివితో ఉన్న ఈ పార్ట్ లో ఎలాంటి సెన్సార్ కట్స్ పడలేకుండా క్లీన్ యూ సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* ఇక సెన్సార్ రిపోర్ట్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించట. ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణ ఔట్ స్టాండింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చారట.
* మరో హైలైట్ సినిమాటోగ్రఫి.. జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలిచిందంటున్నారు. పిరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను..జ్ఞాన శేఖర్ తన సినిమాటోగ్రఫి ద్వారా ఆనాటి కాలానికి (1950, 60, 70, 80) తీసుకెళతారట.
* దివిసీమ ఫ్లడ్స్ ఎపిసోడ్ ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలిచినట్టు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అంటున్నారు.
* మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ఈ సినిమాలో నటీ నటుల ఎంపిక. ఈ సినిమాలో ఆర్టిస్టుల ఎంపిక మరొక హైలైట్ గా నిలిచిందని తెలుస్తోంది. వారి వారి పాత్రల్లో చాలా బాగా నటించినట్టు తెలుస్తోంది.
* బాలకృష్ణ మరియు విద్యాబాలన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయట.
* ఇక మరో హైలైట్ ఈ సినిమా రన్ టైమ్. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నిడివి రెండు గంటల 50 నిమిషాలు
* మరి ఈ హైలైట్స్ చూడాలంటే జనవరి 9వ తేదీ వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=xeXXbPfPuDg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: