ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న తలైవా రజనీకాంత్ మూవీ రిలీజ్ అంటే అభిమానులకు పండగే. పిజ్జా, జిగర్తాండ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెట్టా తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ పేట సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీ రిలీజ్ కానుంది. పేట మూవీ లో సిమ్రాన్, త్రిష కథానాయికలు కాగా, విజయ్ సేతుపతి,
నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పేట మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సక్సెస్ ఫుల్ 2.0 మూవీ తరువాత రిలీజవుతున్న పేట మూవీ పై భారీ అంచనాలున్నాయి. అశోక్ వల్లభనేని నిర్మించిన పేట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (6వ తేదీ )హైదరాబాద్ లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగనుంది.
[youtube_video videoid=PDFt7cpKaxc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: