భరత్ అనే నేను సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన బాలీవుడ్ భామ కియారా అద్వానికి ఆ సినిమా బ్లాక్ బస్టర్ తో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరో రామ్ చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరో పక్కన ఈ భామ ఛాన్స్ కొట్టేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తన తదుపరి సినిమా కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే కదా. గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో…ఈ అవకాశం కియారా అద్వానికి దక్కినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీమ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందట. బన్నీ జోడీగా ఛాన్స్ అంటే ఆమె కాదనే అవకాశం ఉండదు కనుక, ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని చెప్పుకుంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేవరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=and6XZwInKM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: