ఫ్రస్టేషన్, ఫ్రస్టేషన్, ఫ్రస్టేషన్… ఎక్కడో విన్నట్టు..చూసినట్టు ఉంది కదా. ఇంకెక్కడా..ఖేల్ పీడియా యూ ట్యూబ్ ఛానల్ లో ఫ్రస్టేటెడ్ ఉమెన్ అనే వెబ్ సిరీసే. ఫ్రస్టేటెడ్ ఉమెన్ అనే వెబ్ సిరీస్ తో సునయన చేసే వీడియోలు చూస్తే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. జనరల్ గా మన లైఫ్ లో రెగ్యులర్ గా జరిగే థింగ్సే తీసుకొని తనుచేసే వీడియోలు కేవలం నవ్వుకోవడానికే కాదు.. ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. ఇక తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పుడే అమ్మోరు లాంటి సినిమాలో బుల్లి దేవతగా నటించి ప్రశంసలు అందుకుంది. అలాంటి సునయన నటన గురించి ఏం చెబుతాం. బటర్ తో పెట్టిన విద్య లాంటిది. అందుకే తను చేసే వీడియోలు నటించినట్టు కాకుండా క్యాజువల్ ఉంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అసలు ఈ వెబ్ సిరీస్ పుట్టడానికి కారణం తను తెలుగుఫిలింనగర్ యూ ట్యూబ్ ఛానల్ లో కిలికిలి లాంగ్వేజ్ స్పూఫ్ చేయడంతో ఆ వీడియో కాస్త మిలియన్ల కొద్ది వ్యూస్ తో ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో.. కిలికిలి లాంగ్వేజ్ స్పూఫ్ చేయడంతో ఆ వీడియో కాస్త మిలియన్ల కొద్ది వ్యూస్ తో ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో.. ఆ తరువాత ఏదైనా ఉమెన్ సెంట్రిక్ వెబ్ సిరీస్ చేయాలన్న ఆలోచన రావడం…దానిలో నుండి వచ్చిన ఈ ఐడియానే ఫ్రస్టేటెడ్ ఉమెన్ అని సునయన చెబుతున్నారు. అంతేకాదు.. తన చిన్నప్పటి నుండి ఎంతో మంది మహిళలను… వాళ్ల లో ఉన్న ఫ్రస్టేషన్ కూడా చూశానని..అదే ఫ్రస్టేషన్ ను కామెడీగా చెబుతూ ఎంటర్ టైన్ చేస్తూ చెప్పాలనుకున్నానని చెబుతున్నారు.
మరి నిజంగానే అటు ఫ్రస్టేషన్ ను.. ఇటు కామెడీని.. దానికితోడు ఎక్కడా తడబడకుండా పెద్ద పెద్ద డైలాగ్స్ ను సైతం ఈజీగా చెప్పడం.. బామ్మ క్యారెక్టర్ అయినా.. టీనేజ్ అమ్మాయి క్యారెక్టర్ అయినా.. తల్లి క్యారెక్టర్ అయినా.. టీచర్ క్యారెక్టర్ అయినా..ఇలా ఒకటని చెప్పడం కష్టం..ఏ క్యారెక్టర్ లో అయినా పరకాయ ప్రవేశం చేసి తన నటనతో అటు ప్రస్టేషన్ చూపిస్తూనే…ఇటు గిలిగింతలు పెట్టించే సునయన ఇప్పటికీ 50 ఎపిసోడ్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకొని దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఫ్రస్టేటెడ్ ఉమెన్ టీం మొత్తానికి అభినందనలు తెలుపుతూ..ఇంకా ముందు ముందు మరెన్నో ఎపిసోడ్స్ తో అలరించాలని.. ట్రెండింగ్ లో దూసుకుపోవాలని కోరుకుందాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: