సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. వాటిలో `హిట్లర్` మొదటి వరుసలో ఉంటుంది. చెల్లెళ్లను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఓ అన్న కథగా ‘హిట్లర్’ రూపొందింది. మలయాళ చిత్రం ‘హిట్లర్’(మమ్ముట్టి, శోభన) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని ఎడిటర్ మోహన్ నిర్మించారు. సెంటిమెంట్ చిత్రాల స్పెషలిస్ట్ ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రాన్నితెరకెక్కించారు. చిరంజీవి సరసన రంభ హీరోయిన్‌గా నటించగా… చిరు చెల్లెళ్లుగా అశ్వని, మోహిని, పద్మశ్రీ, గాయత్రి, మీనాకుమారి నటించారు. లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సుధాకర్, బాబుమోహన్, కల్పనా రాయ్, రాజా కృష్ణమూర్తి, శుభ ఇతర పాత్రల్లో నటించారు. సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన పాటల్లో ‘నడక కలిసిన నవరాత్రి’ ఆల్ టైమ్ హిట్ సాంగ్‌గా నిలవగా… ‘కన్నీళ్ళకే కన్నీరొచ్చే’, ‘ఓ కాలమా’ పాటలు మనసును కదిలిస్తాయి. 1997 జనవరి 4న విడుదలైన ‘హిట్లర్’… నేటితో 22 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘హిట్లర్’ – కొన్ని విశేషాలు:
* ఒక దశలో వరుస ఫ్లాపుల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని… మళ్లీ సక్సెస్ ట్రాక్‌పైకి తీసుకువచ్చిన చిత్రమిది. నటనకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి ప్రతీ ఏడాది తన సినిమాలతో పలకరిస్తూ వచ్చిన చిరు… తొలిసారిగా 1996లో ఒక్క తెలుగు రిలీజ్ కూడా లేకపోవడం అభిమానులను నిరాశపరిచినా… మంచి కంటెంట్‌తో వచ్చిన `హిట్లర్` తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలచింది. నిరాశలో ఉన్న అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
* ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రం తరువాత మళ్ళీ మూడేళ్ళ గ్యాప్ తో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `అన్నయ్య` కూడా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది.
* లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావుతో కలిసి చిరంజీవి స్క్రీన్‌ను షేర్ చేసుకున్న ఏకైక చిత్రం ఇది.
* విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్… చిరంజీవితో కలిసి నటించిన తొలి చిత్రమిదే కావడం విశేషం.
* తమిళంలో `టైగర్` పేరుతో విడుదలైన ఈ సినిమా… అక్కడ కూడా మంచి విజయం సాధించింది.
[youtube_video videoid=-Poe8WIJEN8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: