శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్, విజయలక్ష్మి, మొగిలి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ … బలగం సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయనీ.. ఈ సినిమాకు యు సర్టిఫికేట్ వచ్చిందనీ.. కొత్త కాన్సెప్ట్ సినిమాలను చేస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో హర్షిత్, హన్షిత కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేశారనీ.. అందులో భాగంగా వేణుతో బలగం సినిమాను చేశామనీ.. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమా అనీ.. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్‌లు సహా ప్రతి ఒక పాత్ర మిమ్మల్ని హాంట్ చేస్తుందనీ.. సినిమాను చూసిన వారందరూ అప్రిషియేట్ చేశారనీ చెప్పారు. బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ వద్ద 28 వ తేదీ గ్రాండ్ గా జరుగనుంది. ఈ ఈవెంట్ కు మున్సిపల్, ఐ టి మినిష్టర్ కెటిఆర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొంటున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























