
ట్యాగ్ · 12 కథనాలు

మరో డిఫరెంట్ మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్
ఇంద్రగంటి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ?
హీరోని కాకపోయి ఉంటే ఖచ్చితంగా అదే అయ్యేవాడిని..!
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా - విజయ్ దేవరకొండ

తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!
ఆంగ్ల శీర్షికలతో విజయ్ దేవరకొండ సందడి
ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ దూకుడు

విజయ్ దేవరకొండతో కియారా అద్వాని?

హైటెక్ సిటీలో 'వరల్డ్ ఫేమస్ లవర్'
'హుషారు' డైరెక్టర్ తో విజయ్..!
`దిల్` రాజు సంస్థలో విజయ్ దేవరకొండ?

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్"లో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "లైగర్" మూవీ షూటింగ్ గోవా లో నెల రోజుల పాటు జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఒక షెడ్యూల్ చేయనున్నారనీ , విజయ్ దేవరకొండకు, విదేశీ బాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను ఫారిన్ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తారని సమాచారం .
మరో డిఫరెంట్ మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్
సెన్సేషనల్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానున్న ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "ఫైటర్ " మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇంద్రగంటి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్‌లో సినిమా రానుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్.
హీరోని కాకపోయి ఉంటే ఖచ్చితంగా అదే అయ్యేవాడిని..!
డాక్టర్ ను అవ్వబోయి యాక్టర్ ను అయ్యాను ఈ డైలాగ్ ఇప్పటికి చాలా సార్లే వినుంటాం. మన టాలీవుడ్ లో చాలా మంది హీరో, హీరోయిన్ లు, డైరెక్టర్ లు, నిర్మాతలు ఇలా చాలా పెద్ద చదువులు చదివిన వాళ్లే వున్నారు. వాళ్ళల్లో కొంత మంది సినిమా మీద ప్రేమతో పెద్ద ఉద్యోగాలు సైతం వదులుకొని రాగా.. కొంతమంది మాత్రం అనుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా వున్నారు. ఇక విజయ్ దేవరకొండ కూడా సినిమా మీద ప్రేమతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. చిన్న పాత్రలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చేసి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి విజయ్ ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు.
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా - విజయ్ దేవరకొండ
కరోనా మహమ్మారి కారణంగా జన జీవనం కష్టాలపాలయింది. ప్రజల ప్రాణ రక్షణ కై తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య బృందాలు, పోలీస్ శాఖ కు కృతజ్ఞతలు తెలపాల్సిందే. పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో హీరో విజయ్ దేవరకొండ కర్తవ్య దీక్షతో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధాన మిచ్చారు.

తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!
వరుస పెట్టి అందరూ పోలీసులపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ బాబు తో మొదలైన ఈ ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు, తర్వాత చిరు.. ఆ తర్వాత వెంకీ.. ఇప్పుడు యంగ్ అండ్ రౌడీ హీరో విజయ్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. అయితే విజయ్ మాత్రం డైరెక్ట్ గా తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి.. పోలీసులను ప్రశంసించాడు. పోలీసులు రియల్ హీరోస్ అంటూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారని విజయ్ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు…
ఆంగ్ల శీర్షికలతో విజయ్ దేవరకొండ సందడి
అనతికాలంలోనే యూత్ ఐకాన్ గా ఎదిగిన వైనం యంగ్ హీరో విజయ్ దేవరకొండ సొంతం. వరుస విజయాలతో, అవకాశాలతో.. సినీవినీలాకాశంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు ఈ యువ సంచలనం.
ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ దూకుడు
తెలుగునాట అనతి కాలంలోనే `యూత్ ఐకాన్`గా ఎదిగాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలతోనే కాదు... తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తోనూ, స్టైల్ ఫ్యాక్టర్ తోనూ యూత్ ని ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేస్తున్నాడీ బ్యాంకబుల్ హీరో. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుపోతున్న ఈ టాలెంటెడ్ స్టార్... సోషల్ మీడియాలోనూ తనదైన హవా చాటుకుంటున్నాడు.

విజయ్ దేవరకొండతో కియారా అద్వాని?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో `ఫైటర్` అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్... బాక్సర్ గా కనిపించనున్నాడని టాక్. అంతేకాదు... యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా దీన్ని నిర్మించాలని పూరి అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట.

హైటెక్ సిటీలో 'వరల్డ్ ఫేమస్ లవర్'
వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి `వరల్డ్ ఫేమస్ లవర్`గా పలకరించబోతున్నాడు విజయ్ దేవరకొండ. నాలుగు విభిన్న ప్రేమకథలతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జోడీగా రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి నాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు.
'హుషారు' డైరెక్టర్ తో విజయ్..!
'డియర్ కామ్రేడ్' సినిమా తర్వాత విజయ్ కథల ఎంపిక విషయంలోకి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో 'వరల్డ్ ఫేమస్ లవర్' లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
`దిల్` రాజు సంస్థలో విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే... ఈ సినిమాని ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మిస్తారని తెలిసింది. విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని నిర్మించాలని `దిల్` రాజు చాన్నాళ్ళుగా భావిస్తున్నారట. శివ నిర్వాణ కాంబినేషన్ మూవీతో అది కార్యరూపం దాల్చనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు.