లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. జూన్ 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పారా అంటూ వచ్చే ఈపాటకు మంచి రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా అనిరుథ్ కంపోజిషన్ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చారు. ఈపాట రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. సెకండ్ సాంగ్ మే 29వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపుతూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేశారు. పోస్టర్ ను బట్టి ఈపాట సిద్దార్థ్ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్నట్టు అర్థమవుతుంది.
A symphony is about to bloom! 🌸 The 2nd single from INDIAN-2, a Rockstar ANIRUDH musical, is dropping on May 29th. 🎼 Get ready to be swept away. ✨🤩#Indian2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan #Siddharth @Rakulpreet @shankarshanmugh @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/vN94292qt9
— Lyca Productions (@LycaProductions) May 27, 2024
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























