
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 59


ఎన్టీఆర్ కు జోడిగా మళ్ళీ బ్రిటిష్ హీరోయినే..!
ప్రభాస్ మరో బాలీవుడ్ మూవీ అమోర్
ఆల్ టైమ్ టాప్ టెన్‌లో `ద లయన్ కింగ్`
ఈ సారి తక్కువ గ్యాప్‌లోనే రానున్న రాజశేఖర్
ఆగస్టు 23న పది చిత్రాల సందడి
ఐశ్వర్యా రాజేష్... డబుల్ ధమాకా
నవతరం ‘మిస్సమ్మ’... భూమిక

'అల వైకుంఠపురంలో' బన్నీ ద్విపాత్రాభినయం..!
నాగచైతన్య తెలంగాణ కుర్రాడు
కేరళ స్టేట్ లో గుడ్ రెస్పాన్స్
పూరి-విజయ్ చిత్రంలో జాన్వి?
మల్లూవుడ్‌లో మిల్కీ బ్యూటీ మెరుపులు

మంచు విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్?

100 రోజులు పూర్తి చేసుకున్న మహర్షి

యన్టీఆర్ ‘నిండు హృదయాలు’కు 50 ఏళ్ళు

'బోయ్' సినిమా విడుదల తేదీ ఖరారు
లక్ష్, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా `బోయ్`. హై స్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అమర్ విశ్వరాజ్. నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగస్ట్ 23న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం జరిగింది. రాజ్ కందుకూరి బిగ్ సీడీని విడుదల చేశారు.
మేమేమి తిని కూర్చోము - అలా అనుకుంటే వారి అమాయకత్వం
'అలా' మొదలయింది సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. సినిమా సినిమా కు వైవిద్యం చూపుతూ.. చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. తనకు నచ్చని సినిమాల కు ఏ మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పే వ్యక్తిత్యం నిత్యామీనన్ ది. కేవలం సినిమా విషయంలోనే కాదు... మిగిలిన విషయాల్లో కూడా తాను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
తెలుగు లో ఫస్ట్ సాంగ్ - జాక్విలిన్ ఫెర్నాండెజ్
సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ సాహో మూవీ లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. సాహో మూవీ లోని మూడవ సాంగ్ బ్యాడ్ బాయ్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ను బాద్ షా , నీతి మోహన్ ఆలపించారు. రచన, సంగీతం బాద్ షా అందించిన బ్యాడ్ బాయ్ సాంగ్ ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించింది.

ఎన్టీఆర్ కు జోడిగా మళ్ళీ బ్రిటిష్ హీరోయినే..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం రామ్ చరణ్ బ్రేక్ లో ఉండగా.. ఎన్టీఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బల్గెరియా వెళ్లనున్నారట చిత్ర యూనిట్.
ప్రభాస్ మరో బాలీవుడ్ మూవీ అమోర్
భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అభిమాన గణం అధికం. క్రేజీ హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీ కై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆసక్తి తో ఎదురు చూస్తుంది.
ఆల్ టైమ్ టాప్ టెన్‌లో `ద లయన్ కింగ్`
`ద లయన్ కింగ్`.. 1994లో చారిత్రక విజయం సాధించిన అమెరికన్ యానిమేటడ్ మ్యూజికల్ ఫిల్మ్. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం... పాతికేళ్ళ తరువాత అదే పేరుతో రీమేక్ అయ్యింది. ఈ సారి యానిమేటెడ్ ఫిల్మ్‌లా కాకుండా... ఫొటో-రియలిస్టిక్ కంప్యూటర్ యానిమేటేడ్ వెర్షన్‌లో రీమేక్ అయి విడుదలయ్యింది. ‘ద జంగిల్ బుక్’ దర్శకుడు జాన్ ఫేవరోవ్ ఈ సినిమాని రూపొందించాడు. జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం... భారతదేశంలోనూ పలు భాషల్లో అనువాదమై ఆడియన్స్‌ను అలరించింది. ఇక తెలుగు వెర్షన్‌కు నాని, జగపతి బాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ వంటి ప్రముఖులు గాత్రమిచ్చారు.
ఈ సారి తక్కువ గ్యాప్‌లోనే రానున్న రాజశేఖర్
‘గరుడవేగ’, ‘కల్కి’... ఇలా వరుసగా థ్రిల్లర్ మూవీస్‌తో సందడి చేస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్... తాజాగా మరో థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ కన్నడ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి ‘బేతాళుడు’ ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ నటుడు సత్యరాజ్ తనయుడు శిబీ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని తమిళ నిర్మాత ధనుంజయన్ నిర్మిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని... 2020 మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆగస్టు 23న పది చిత్రాల సందడి
ఈ ఆగస్టు 23 ... సినీ ప్రేమికులకు పండుగ రోజు. ఎందుకంటే... గత కొంత కాలంగా ప్రతీ వారం నాలుగు లేదా ఐదు చిత్రాలు విడుదల అవుతుండగా... ఈ వారం ఏకంగా పది సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి ముస్తాబవుతున్నాయి.
ఐశ్వర్యా రాజేష్... డబుల్ ధమాకా
తమిళనాట వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతోంది నటి ఐశ్వర్యా రాజేష్. కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా... అభినయానికి అవకాశమున్న సహాయక పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తోంది ఈ తెలుగమ్మాయి. కాగా... ఈ ఆగస్టు 23 ఐశ్వర్యకి ఎంతో స్పెషల్ కానుంది. ఎందుకంటే... అదే రోజున ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన రెండు ఆసక్తికరమైన చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి తెలుగు చిత్రం కాగా... మరొకటి తమిళ చిత్రం.
నవతరం ‘మిస్సమ్మ’... భూమిక
భూమిక చావ్లా... నవతరం `మిస్సమ్మ`. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను `ఖుషి` చేసిన ఈ స్మైలింగ్ బ్యూటీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా... సినీ వినీలాకాశంలో భూమిక సాగిన తీరుని గుర్తు చేసుకుందాం.

'అల వైకుంఠపురంలో' బన్నీ ద్విపాత్రాభినయం..!
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురంలో'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇటీవలే ఈ టైటిల్ ను ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
నాగచైతన్య తెలంగాణ కుర్రాడు
ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్, P రామ్ మోహన్ రావు నిర్మాతలుగా నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో హీరో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడు గా నటించనున్నారు. తన క్యారెక్టర్ కై నాగచైతన్య ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ స్లాంగ్ ను నేర్చుకుంటున్నారు.
కేరళ స్టేట్ లో గుడ్ రెస్పాన్స్
PVP సినిమా బ్యానర్ పై వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. అడివిశేష్ పోలీస్ ఆఫీసర్ గా నటనలో వేరియేషన్స్ తో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఎవరు మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు 1.7 కోట్ల షేర్ సాధించి అడివి శేష్ సినీకెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన మూవీగా నిలిచింది.
పూరి-విజయ్ చిత్రంలో జాన్వి?
`ఇస్మార్ట్ శంకర్` ఘనవిజయం దర్శకుడు పూరీ జగన్నాథ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరో వైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయాడు ఈ స్టార్ డైరెక్టర్. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
మల్లూవుడ్‌లో మిల్కీ బ్యూటీ మెరుపులు
తమన్నా భాటియా... గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మరాఠి భాషల్లో సందడి చేసిన ఈ మిల్కీ బ్యూటీ... త్వరలో మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనుందట. అది కూడా ఓ హారర్ మూవీతో.

మంచు విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్?
ప్రస్తుతం మంచు విష్ణు వరుస ప్లాప్స్ తో గడ్డు కాలంలోనే ఉన్నాడు. అందుకే ఈసారి పక్కా ప్లాన్ తో వస్తున్నాడు. ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్ లతో వస్తున్నట్టు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి శ్రీ కాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ కాగా మరొకటి కాజల్, విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా. మిగిలిన సినిమాల వివరాలు తెలియాల్సి వుంది.

100 రోజులు పూర్తి చేసుకున్న మహర్షి
వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన సినిమా మహర్షి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అన్ని అంచనాలను రీచ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. సందేశాత్మకంగా తీయడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక సినిమా రెండు మూడు వారాలు ఆడటమే ఎక్కువ. అలాంటిది మహర్షి విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. ఇప్పటికే 50 రోజులు పూర్తిచేసుకుని రికార్డు క్రియేట్ చేసిన మహర్షి తాజాగా మరో రేర్ ఫీట్ ను కూడా దాటింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూవీ ఐదు సెంటర్స్ లో వంద రోజులు పూర్తిచేసుకుంది.

ఎవరు రివ్యూ - అడివి శేషు మార్క్ మరో క్రైమ్ థ్రిల్లర్ ఎవరు?
It's worth watching and worth suggesting.

యన్టీఆర్ ‘నిండు హృదయాలు’కు 50 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘నిండు హృదయాలు’. యన్టీఆర్, శోభన్‌బాబు, చలం కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో వాణిశ్రీ, గీతాంజలి, చంద్రకళ నాయికలుగా నటించారు. సత్యనారాయణ, రేలంగి, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, రుక్మిణి, మిక్కిలినేని, ఛాయాదేవి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రాన్ని ఎస్.వి.ఎస్.ఫిలిమ్స్ పతాకంపై ఎం.జగన్నాథరావు నిర్మించారు.

పంద్రాగస్టున పసందైన వినోదం పంచిన మహానటుడు యన్టీఆర్
మహానటుడు నందమూరి తారక రామారావుకి, పంద్రాగస్టు (ఆగస్టు 15)కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే... ఈ ప్రత్యేకమైన రోజున వేర్వేరు సంవత్సరాల్లో తారక రాముడు నటించిన నాలుగు చిత్రాలు విడుదల కాగా... వీటిలో మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆ సినిమాలే... `మంచి మనసుకు మంచి రోజులు`, `బందిపోటు`, `నిండు హృదయాలు`, `రౌడీ రాముడు - కొంటె కృష్ణుడు`.