ఐశ్వ‌ర్యా రాజేష్… డ‌బుల్ ధ‌మాకా

Double Dhamaka For Aishwarya Rajesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Aishwarya Rajesh Latest News,Actress Aishwarya Rajesh Upcoming Movie News,Heroine Aishwarya Rajesh New Movie News,Aishwarya Rajesh Next Film Updates,Aishwarya Rajesh Next Film Updates

త‌మిళ‌నాట వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతోంది న‌టి ఐశ్వర్యా రాజేష్. కేవ‌లం క‌థానాయిక పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా… అభిన‌యానికి అవ‌కాశ‌మున్న స‌హాయ‌క పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అల‌రిస్తోంది ఈ తెలుగ‌మ్మాయి. కాగా… ఈ ఆగ‌స్టు 23 ఐశ్వ‌ర్య‌కి ఎంతో స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే… అదే రోజున ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన రెండు ఆస‌క్తిక‌ర‌మైన‌ చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒక‌టి తెలుగు చిత్రం కాగా… మ‌రొక‌టి త‌మిళ చిత్రం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఐశ్వ‌ర్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన త‌మిళ సినిమా `క‌నా`కి రీమేక్‌గా రూపొందిన తెలుగు చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఐశ్వ‌ర్య తెలుగులో తొలి అడుగులు వేస్తోంది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. కాగా… ఇదే రోజున ఐశ్వర్య నటించిన తమిళ చిత్రం ‘మెయ్’ కూడా విడుదల కానుంది. మెడికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. మ‌రి… ఇలా ఒకే రోజున‌ రెండు వేర్వేరు భాషల చిత్రాలతో ప‌ల‌క‌రించ‌నున్న‌ ఐశ్వర్యకి ఎలాంటి ఫ‌లితాలు ద‌క్కుతాయో చూడాలి..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 1 =