కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 37

సినిమా వార్తలు

తుపాకి రాముడు మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లండన్ కూడా భళా 'బాహుబలి'

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.

TFN Adminవాట్సాప్
Bollywood Actor In Venkatesh New Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Venkatesh New Movie,Venkatesh New Movie Updates,Bollywoo Star Actor in Venkatesh Movie,Victory Venkatesh Latest News 2
సినిమా వార్తలు

వెంక‌టేష్ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు?

‘విక్టరీ’ వెంకటేష్, యంగ్‌ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న‌ సంగతి తెలిసిందే. `హార్స్ క్లబ్` బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌... ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఇందులో ఓ శక్తిమంతమైన పాత్ర కోసం బాలీవుడ్ విల‌క్ష‌ణ‌ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీని ఎంపిక చేసే దిశ‌గా త‌రుణ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Anushka Bhaagamathie Goes To Bollywood?,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Anushka Bhaagamathie in Bollywood,Bhaagamathie Hindi Movie,Anushka New Movie Updates
సినిమా వార్తలు

హిందీకి వెళుతున్న‌ ‘భాగమతి’?

‘భాగమతి’… గత ఏడాది తెలుగునాట కాసుల వర్షం కురిపించిన థ్రిల్లర్ మూవీ. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఈ హీరోయిన్‌ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ను జి.అశోక్ డైరెక్ట్ చేశాడు. కాగా, ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్ట్‌ను హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
Interesting Title For Hero Nithiin New Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Nithiin New Movie,Nithiin New Movie Title,Hero Nithiin Upcoming Interesting Title
సినిమా వార్తలు

‘A 1’ గా నితిన్?

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైండ్ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు ‘చదరంగం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఇప్పుడు ‘A 1’ అనే టైటిల్ వైపు యూనిట్ మొగ్గు చూపిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే, ఈ రెండింట్లో ఏది ఫైనల్ అవుతుందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

Team TFNవాట్సాప్
స్పెషల్

బాలీవుడ్ లో సౌత్ డైరెక్టర్ల హవా

మొత్తానికి మన సౌత్ డైరెక్టర్ల హవా బాలీవుడ్ లో బాగానే నడుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే మన వాళ్లు చాలా కష్టపడేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ళే మన వాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు దాదాపు డజనుకుపైగా డైరెక్టర్లు బాలీవుడ్ హీరో లని డైరెక్ట్ చేస్తున్నారు. అది కూడా బాలీవుడ్ సూపర్ స్టార్లనే. మరి వారెవరో ఒకసారి చూద్దామా..

TFN Adminవాట్సాప్
సాంగ్

‘సామజవరగమన’ తెలుగు సినీ చరిత్రలో మొదటి పాట ఇదే

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురంలో'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ అంత ఇంత సెన్సేషన్ క్రియేట్ చెయ్యట్లేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా...ఇటీవల వచ్చిన పాటలలో ఈ పాట మ్యూజిక్ లవర్స్ కి తెగ నచ్చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సూపర్ హీరో' తరహాలో అఖిల్ సినిమా..?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా... గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నూటొక్క జిల్లాల అందగాడు మూవీ ప్రారంభం

కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ భాగస్వామ్యం లో నిర్మించడానికి తాను సిద్ధం అంటూ సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దిల్ రాజు ప్రతిపాదనకు తొలి అడుగు పడింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి తో కలసి దర్శకుడు క్రిష్ గమ్యం, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు. తరువాత నిర్మించిన ఫస్ట్ స్పేస్ ఫిల్మ్ అంతరిక్షం నిరాశ పరిచింది. ఇప్పుడు దిల్ రాజు భాగస్వామ్యంలో నూటొక్క జిల్లాల అందగాడు మూవీ నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

సాంగ్స్ చిత్రీకరణ లో 90ML మూవీ

కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్ పై క్రేజీ హీరో కార్తికేయ కథానాయకుడిగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో 90ML మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కార్తికేయ మోడరన్ దేవదాస్ పాత్రలో నటిస్తుండగా, నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ , అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MBA గోల్డ్ మెడలిస్ట్ దేవదాస్ ఆథరైజ్డ్ డ్రింకర్ గా ఎలా మారేడు అన్న కాన్సెప్ట్ తో 90ML మూవీ రూపొందుతుంది. అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో చంద్రబోస్ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ గానం చేసిన ఇనిపించుకోరు సాంగ్ రిలీజయి యూత్ ను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం

ఇస్మార్ట్ శంకర్ మూవీ ఘనవిజయం సాధించడంతో విజయో త్సాహం తో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఈ మూవీ రూపొందనుంది. కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో రూపొందిన నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ మూవీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ తడం కు తెలుగు రీమేక్ వెర్షన్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లండన్ లో బాహుబలి టీమ్

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన బాహుబలి -ది బిగినింగ్ ఘనవిజయం సాధించి అనేక రికార్డ్స్ నెలకొల్పి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ బాహుబలి - ది కంక్లూజన్ రూపొంది రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి ప్రపంచ వ్యాప్తం గా తెలుగు మూవీ ఘనతను చాటి చెప్పింది. ఇప్పుడు మరొక అరుదైన రికార్డ్ ను సాధించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజికల్ సెన్సేష‌న్‌ ‘గోరింటాకు’కు 40 ఏళ్ళు

న‌ట‌భూష‌ణ్‌ శోభన్‌బాబు, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కాంబినేష‌న్‌లో ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘గోరింటాకు’ ఒకటి. సుజాత, వక్కలంక పద్మ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ మ్యూజిక‌ల్‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో సావిత్రి, ప్రభాకర రెడ్డి, జె.వి.రమణమూర్తి, దేవదాస్ కనకాల, చలం, రమాప్రభ త‌దిత‌రులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘మ‌న‌సంతా నువ్వే’కు 18 ఏళ్ళు

ఉదయ్ కిరణ్... ఈ పేరు చెబితే పలు యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్స్ కళ్ళ ముందు కదలాడతాయి. ముఖ్యంగా, త‌న కెరీర్ ఆరంభంలో మూడు వరుస విజయాలతో “హ్యాట్రిక్ హీరో” అనిపించుకున్నాడు ఉద‌య్‌. ఆ హ్యాట్రిక్ మూవీస్‌లో మూడో చిత్ర‌మే ‘మనసంతా నువ్వే’. ఉద‌య్‌కిర‌ణ్‌కి జోడీగా రీమా సేన్ న‌టించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో సునీల్, తను రాయ్, చంద్రమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ళ భరణి, సుధ, రజిత, మాస్ట‌ర్ ఆనంద్ వ‌ర్థ‌న్‌, బేబి జీబా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ గీత‌ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అతిథి పాత్రలో దర్శనమిచ్చారు. ‘చిత్రం’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఉద‌య్ కిర‌ణ్‌, రీమా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

“ఆదిత్య అరుణాచలం” గా ర‌జినీకాంత్‌

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘దర్బార్’. పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార క‌థానాయికగా న‌టించింది. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కార్తీ 'ఖైదీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

'మా న‌గ‌రం' ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమాను దీపావళి పండుగకే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'లవర్స్ డే' కే 'వరల్డ్ ఫేమస్ లవర్'

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిన్నారి అభిమాని మృతి- బాలకృష్ణ ఎమోషనల్ మెసేజ్

బాలకృష్ణ డైలాగ్స్ తో అలరించి.. తన డైలాగ్స్ తో హావభావాలతో అందరిని ఆకట్టుకున్నాడు బుల్లితెర నటుడు గోకుల్. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన ఈ బుడ్డడికి బాలకృష్ణ డైలాగ్స్ చెప్పడం అంటే ఇష్టం. అయితే దురదృష్టం ఏంటంటే గోకుల్ మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా గోకుల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గోకుల్ ను తల్లిదండ్రులు బెంగుళూరులోని ఓ ఆసపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయిస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ గోకుల్ గురువారం రాత్రి మరణించాడు.

TFN Adminవాట్సాప్
Rowdy Vijay Deverakonda Launched Bithri Sathi Tupaki Ramudu Teaser,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Bithri Sathi Tupaki Ramudu Teaser,Tupaki Ramudu Teaser,Tupaki Ramudu Movie Teaser,Rowdy Vij
ట్రైలర్ & టీజర్

'తుపాకి రాముడు' టీజర్ రిలీజ్

డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో 'తీన్మార్' ప్రోగ్రాం తో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు బిత్తిరి సత్తి. ఇక ఇన్ని రోజులు బుల్లి తెరపై అలరించిన బిత్తిరి సత్తి.. ఇప్పుడు వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాకర్ దర్శకత్వంలో బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో 'తుపాకి రాముడు' అనే కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. అక్టోబర్ 25 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Ala Vaikunthapurramuloo Movie Interesting Update,Stylish Star Allu Arjun New Updates,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Indian 2 Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Latest News,Allu Arj
సినిమా వార్తలు

అల .. వైకుంఠ పురములో .. మూవీ త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్

అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, S/O సత్యమూర్తి, అ ఆ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తనదైన స్టైల్ లో పంచ్ డైలాగ్స్ తో,ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా తెరకెక్కించిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అజ్ఞాత వాసి, అరవింద సమేత మూవీస్ లో కామెడీ లోపించిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న అల .. వైకుంఠ పురములో .. మూవీ ని తనదైన మార్క్ తో కామెడీ ఎంటర్ టైనర్ మూవీ గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్