కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్ పై క్రేజీ హీరో కార్తికేయ కథానాయకుడిగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో 90ML మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కార్తికేయ మోడరన్ దేవదాస్ పాత్రలో నటిస్తుండగా, నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ , అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MBA గోల్డ్ మెడలిస్ట్ దేవదాస్ ఆథరైజ్డ్ డ్రింకర్ గా ఎలా మారేడు అన్న కాన్సెప్ట్ తో 90ML మూవీ రూపొందుతుంది. అనూప్
రూబెన్స్ స్వరకల్పనలో చంద్రబోస్ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ గానం చేసిన ఇనిపించుకోరు సాంగ్ రిలీజయి యూత్ ను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
90ML మూవీ దర్శకుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ .. ఇనిపించుకోరు సాంగ్ ను కోకాపేట లో ప్రత్యేక సెట్ ను రూపొందించి జానీ మాస్టర్ ఆధ్వర్యం లో 50 మంది డాన్సర్స్, 150 జూనియర్ ఆర్టిస్ట్స్ తో చిత్రీకరించామని, సాంగ్ బాగా వచ్చిందని తెలిపారు. నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ … 90ML మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని, సాంగ్స్ చిత్రీకరణ జరుపుతున్నామని,రెండు సాంగ్స్ చిత్రీకరణకు
అజర్ బైజాన్ వెళుతున్నామని, యూత్ తోపాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా మూవీ రూపొందుతుందని చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: