‘లవర్స్ డే’ కే ‘వరల్డ్ ఫేమస్ లవర్’

Worlds Famous Lover to Release on a Special Day,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Worlds Famous Lover Movie Release Date,Worlds Famous Lover Latest News

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండాగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమా వచ్చే ఏడాది లవర్స్ డే అదే వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ నాలుగు షేడ్స్ లో కనిపించనున్నాడట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 11 =