వినికిడి లోపం ఉన్న త‌ల్లి పాత్ర‌లో శ్రియ‌?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Shriya Saran In A Different Role, A Different Role by Shriya Saran, Shriya Saran To Do Mother Character In Next, Shriya Saran to become mother in Her Next, Shriya Saran to once again play a mother in her next film

శ్రియా శరన్‌… నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక‌. అందానికి చిరునామాగా నిలచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… పలు చిత్రాల్లో అభిన‌యానికి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ క‌నిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కాగా… ఇప్పుడు మరోసారి యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో నటించడానికి సిద్ధపడుతోందట ఈ ఉత్త‌రాది సోయ‌గం.

ఆ వివరాల్లోకి వెళితే… నూతన దర్శకురాలు సృజన ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ని తెర‌కెక్కిస్తోంది. కాగా… ఇందులో ఓ ఆస‌క్తికరమైన పాత్ర కోసం శ్రియను ఎంపిక చేసిందట చిత్ర బృందం. వినికిడి లోపం ఉన్న త‌ల్లి పాత్ర‌లో శ్రియ క‌నిపిస్తుంద‌ని… ఓ ఎమోషనల్ జర్నీగా ఆమె పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం. శ్రియ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో… ఇతర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయ‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉంటే… గతంలో శ్రియ తల్లి పాత్రలో నటించిన ‘మనం’, ‘గోపాల గోపాల’, `దృశ్యం` (హిందీ), ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రాలు విజయం సాధించ‌డంతో పాటు ప్రేక్షకుల మన్ననలను కూడా పొందాయి. ఈ నేపథ్యంలో… మరోసారి తల్లి పాత్రలో క‌నిపించ‌డ‌మే కాకుండా ఓ డిఫ‌రెంట్ రోల్‌లో ద‌ర్శ‌న‌మ‌వివ్వ‌నున్న శ్రియకు… ఈ కొత్త ప్ర‌య‌త్నం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here