యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం లో తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయిన విషయం తెలిసిందే. సాహో మూవీ కి మిశ్రమ స్పందన లభించినా, కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. సాహో మూవీ రిలీజ్ తరువాత దర్శకుడు సుజీత్ మీడియా తో సమావేశమయ్యారు. తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్, దేశం లోని వివిధ ప్రాంతాలనుండి సాహో మూవీ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సుజీత్ మీడియా తో పంచుకొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సుజీత్ మీడియా తో మాట్లాడుతూ .. క్రిటిక్స్, రివ్యూయర్స్ పై తనకు అపారమైన గౌరవం ఉందని, తన మొదటి సినిమా రన్ రాజా రన్ ను తమ రివ్యూస్ తో బ్లాక్ బస్టర్ మూవీ గా చేశారని, మూవీని ఎనాలసిస్ చేసి తమ అభిప్రాయం చెప్పడం క్రిటిక్స్, రివ్యూయర్స్ డ్యూటీ అని, సాహో వంటి బిగ్ బడ్జెట్ మూవీస్ కు రివ్యూస్ ఇచ్చేవారు కొంతకాలం వెయిట్ చేసి తమ అభిప్రాయం తెలిపితే బాగుంటుందని మీడియా కు సజెస్ట్ చేశారు. బీహార్ వంటి స్టేట్ లో సాహో మూవీ కి అద్భుతమైన స్పందన లభించిందని, ఉత్తరాది రాష్ట్రాలలో తన వర్కింగ్ స్టైల్ కు ప్రశంసలు లభించాయని. సాహో మూవీ కాన్సెప్ట్ తో అనేక సినిమాలు రుపొందాయని, ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ మూవీ కి కాపీ అనడం సరికాదని కాపీ రూమర్స్ కు సుజీత్ నవ్వుతూ చెక్ పెట్టారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: