కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Thaman S

ట్యాగ్ · 312 కథనాలు · పేజీ 16

సాంగ్

వకీల్ సాబ్ 'కంటిపాప' సాంగ్ రిలీజ్

వేణు శ్రీరామ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. మొదటిపాట ‘మగువ..మగువ’ 2020 ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఆపాప వినిపిస్తూనే ఉంది. మార్చిలో మ్యూజికల్ ట్రీట్ ఇస్తానని చెప్పినట్టే సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే సత్యమేవ జయతే పాటను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సాంగ్

'వకీల్ సాబ్' నుండి మరోపాట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'వకీల్ సాబ్' సత్యమేవ జయతే సాంగ్ రిలీజ్

మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూశాం. వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'టక్ జగదీష్' టీజర్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'టక్ జగదీష్'. 'నిన్ను కోరి' సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుండే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్.. మోషన్ పోస్టర్ ఆ అంచనాలను ఇంకా పెంచేసింది. మరోసారి నాని-శివ తమ మ్యాజిక్ ను క్రియేట్ చేసేలా ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడింది. క్లాస్ లుక్ లో మాస్ యాంగిల్ నాని యాక్షన్ సినిమాకు పెద్ద హైలైట్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ అయ్యాయి కూడా.

TFN Adminవాట్సాప్
Inkosaari Inkosaari First Single From Tuck Jagadish Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Inko Saari Song,Tuck Jagdish Movie Songs,Tuck Jagdish Songs,Nani Tuck Jaga
సాంగ్

టక్ జగదీష్ - 'ఇంకోసారి ఇంకోసారి' ఫస్ట్ లిరికల్ రిలీజ్

స్పెషల్ డేస్ లో మూవీస్ నుండి అప్ డేట్స్ రావడం కామన్. ఇక రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా సినిమాల నుండి వరుస పెట్టి సినిమాలు రానున్నాయి. ఇక టక్ జగదీష్ నుండి ఒక రోజు ముందే అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. చెప్పినట్టే ఈ రోజు 'ఇంకోసారి ఇంకోసారి' అనే మెలోడీ పాటను రిలీజ్ చేశారు. లిరికల్ పాటను మాత్రమే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గుమ్మడి వరలక్ష్మి.. గుమ్మ.. ఏ నచ్చలేదా? అంటూ నాని అడిగిన ప్రశ్న... దానికి రీతూ వర్మ నచ్చింది అంటూ చెప్పడం.. థమన్ సంగీతం.. శ్రేయా ఘోషల్, కాల భైరవ గాత్రం.. అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
Music Director Thaman Gives Five Stars To Pawan Kalyan In Vakeel Saab Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Music Director Thaman,Thaman S,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Actor Pawan Kaly
ఫస్ట్ లుక్

పవన్ కు థమన్ 5స్టార్స్

దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొనివేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Vakeel Saab Movie Teaser Sets New Records On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Actor Pawan Kalyan,Va
ట్రైలర్ & టీజర్

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న 'వకీల్ సాబ్' టీజర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో మరో సారి నిరూపించాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ ను పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ టీజర్ కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా కోర్టులో వాదించడం తెలుసు కోటు తీసి కొట్టడం తెలుసు అని చెప్పే డైలాగ్‌ వైరల్ గా మారింది. పవర్‌ స్టార్‌ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. దీనితో టీజర్ ఇప్పుడు ట్రెండింగ్ లో మొదటి స్థానంలో 10 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'క్రాక్' అక్కడ ఒక రోజు ముందే విడుద‌ల

మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రం 'క్రాక్‌'. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పక్కా హిట్ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎంట‌ర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియెన్స్ ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈ సంక్రాంతికి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ క్రాక్ - ర‌వితేజ‌

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నాను. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుదలైన ట్రైల‌ర్‌, పాట‌లకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న‌ ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మాస్‌రాజా ర‌వితేజ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాకు రెడీ అవుతున్నాడు. అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'క్రాక్' మేకింగ్ వీడియో

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉండగా.. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థమన్ 'బుధవారం' ట్వీట్ 'వకీల్ సాబ్' గురించా..?

రీసెంట్ గానే చిరు పుట్టిన రోజు అయిపోయింది. ఇక చిరు పుట్టిన రోజున కామన్ మోషన్ పోస్టర్, కామన్ డీపీ అంటూ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ బాగానే హడావుడి చేశారు. ఇక ఫ్యాన్స్ కోసం ఆచార్య నుండి ఒక అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం. మరి ఎంత సెలెబ్రేట్ చేయొద్దని చెప్పినా ఫ్యాన్స్ కదా ఏదో ఒక రకంగా తమ హీరోపై అభిమానంతో ఏదో ఒకటి చేస్తారు. అంతేకాదు తన సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని అదే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.

TFN Adminవాట్సాప్

షేర్