ఈ సంక్రాంతికి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ క్రాక్ – ర‌వితేజ‌

Krack Is A Perfect Entertainer For This Festive Season Says Ravi Teja,Krack,Krack Movie Team Interview,Mass Maharaja Ravi teja Latest Interview,Ravi teja Special Interview,Krack Movie Trailer,Ravi Teja,Shruti Hassan,Gopichand Malineni,Thaman S,Krack Movie Teaser,Raviteja,Raviteja,Shruti Hassan,Krack Movie Trailer,Krack Trailer,Krack Songs,Latest Telugu Trailers,Mass Maharaja,Raviteja Movies,Raviteja New Movies,krack telugu movie trailer,ravi teja krack movie trailer,krack trailer telugu,ravi teja krack trailer,krack,krack movie Launch

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నాను. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుదలైన ట్రైల‌ర్‌, పాట‌లకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న‌ ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మాస్‌రాజా ర‌వితేజ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త‌మిళ‌నాడు ప్రభుత్యం ఇచ్చిన‌ట్టుగానే ఇక్క‌డ కూడా 100% సీటింగ్ కెపాసిటీ ప‌ర్మీష‌న్ వ‌స్తే బాగుండేది అనిపించిందా?

ఇక్కడ కూడా 100% సీటింగ్ కెపాసిటీ ప‌ర్మీష‌న్ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి అని తెలిసింది. ప‌ర్మీష‌న్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏది ఏమైనా థియేట‌ర్‌కి వ‌చ్చి సినిమా చూసే ప్రేక్ష‌కులు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించండి. అలాగే వీలైతే చిన్న శానిటైజ‌ర్ బాటిల్ కూడా మీ వెంట తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నా.

కరోనా వల్ల చాలా నెలలు షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్నారు. ఈ మధ్యనే షూటింగ్స్ మొదలయ్యాయి. మరి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని షూటింగ్ చేసిన ఎంతో కొంత భ‌యం అయితే ఉంటుంది క‌దా?

లాక్‌డౌన్ త‌ర్వాత దాదాపు 200మంది డ్యాన్స‌ర్స్‌తో 2 సెట్ సాంగ్స్ షూట్ చేశాం. స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వల్లే మా సెట్లో ఎవ్వ‌రికి క‌రోనా రా‌లేదు. దాంతో మాకు కొంత ధైర్యం వ‌చ్చింది. క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకుంటే త‌ప్ప‌కుండా షూటింగ్స్ జ‌రుపుకోవ‌చ్చు. సెట్లో ఎవ‌రైనా మాస్క్ లేకుండా క‌నిపిస్తే త‌ప్ప‌కుండా మాస్క్ వేసుకోమ‌ని చెప్పేవాడిని.

సంక్రాంతికి వ‌స్తున్నారు క‌దా ఎలా అనిపిస్తుంది?

మాములు రోజుల్లో ఒక సినిమా చూడ‌డానికి, పండుగ సీజ‌న్లో మూవీ చూడ‌డానికి చిన్న తేడా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నేను కూడా అలా సినిమాలు చూసి వ‌చ్చిన వాణ్నే కాబట్టి. అయితే ఈ పండుగ‌కి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. నా క్యారెక్ట‌ర్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మాస్ ఎలిమెంట్స్ సూప‌ర్‌గా ఉన్నాయి, అలాగే పాట‌లు కూడా బాగా కుదిరాయి. ఈ పండుగ‌కి త‌ప్ప‌కుండా సినిమా ఒక విందు బోజ‌నంలా ఉంటుంది. ఆడియ‌న్స్ కూడా త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు.

మీరు గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో రెండు సినిమాలు వచ్చాయి. హిట్ కొట్టాయి. ఇప్పుడు మూడో సినిమాతో వస్తున్నారు. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని అనిపిస్తుందా?

ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడ‌తాం అనుకుంటున్నాం. ఎందుకో తెలీదు మా ఇద్ద‌రికీ ప్రాప‌ర్‌గా సెట్ అయ్యింది. ఈ సినిమా త‌ప్ప‌కుండా వ‌ర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను.

ఈ సినిమాలో మీ క్యారెక్ట‌ర్ డ‌బుల్ మాస్ అనుకోవ‌చ్చా?

డబుల్ మాస్ లేదా త్రిబుల్ మాసా అనేది రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

పూరిజ‌గ‌న్నాధ్ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేనితోనే ఎక్కువ సినిమాలు చేశారు క‌దా..?

అలా కుదిరింది అంతే..ఏది ప్లాన్ చేసి చేయ‌లేదు..ఒక‌వేళ అలా ప్లాన్ చేసినా సెట్ అవ‌దు.

లాక్‌డౌన్ ఎలా గ‌డిచింది?

అద్భుతంగా గ‌డిచింది. నేను మాములుగానే ఫ్యామిలీ మెన్‌ని. ఫ్యామిలీతో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతాను. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయ‌గ‌లిగాను. అలాగే హ్యాపీగా వ‌ర్క‌వుట్స్ చేసుకున్నాను. నెట్‌లో చాలా కంటెంట్ ఉంది. బోలెడు సినిమాలు చూశాను. చాలా కొత్త కొత్త‌ విష‌యాలు నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక్క క్ష‌ణం కూడా బోర్‌గా ఫీల‌వ్వ‌లేదు.

మీ పిల్ల‌లు మిమ్మ‌ల్ని ఎలాంటి క్యారెక్ట‌ర్లో చూడాలి అని అనుకుంటున్నారా?

నేనేం చేసినా వారికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.

జ‌న‌వ‌రి 26 మీ పుట్టిన‌రోజు క‌దా బ‌ర్త్ డే ప్లాన్స్ ఏంటి?

స్పెష‌ల్ ప్లాన్స్ అంటూ ఏమి లేవు..మాములుగానే నేను బ‌ర్త్‌డేస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వ‌ను. ఈ నెల‌లో నా సినిమా రిలీజ‌వుతుంది అదే నాకు పెద్ద పండుగ‌.

సంగీత ద‌ర్శ‌కుడు థమన్ గురించి చెప్పండి?

మొద‌ట్లో పూరీ కాంబినేష‌న్‌లో చ‌క్రీతో ఎక్కువ సినిమాలు చేశాను. ఆ త‌ర్వాత ఎక్కువ సినిమాలు చేసిందిథమన్ తోనే..నాకు ఎలాంటి పాట‌లు ఇవ్వాలో థమన్ కి బాగా తెలుసు. ఈ సినిమాలో పాట‌ల‌కి బ్ర‌హ్మండ‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.

మిగ‌తా క్యారెక్ట‌ర్స్ గురించి?

శృతి హాస‌న్ చాలా మంచి క్యారెక్ట‌ర్ చేసింది. అలాగే స‌ముద్ర‌ఖని గారు నాకు చాలా ఇష్ట‌మైన వ్య‌క్తి ఆయ‌న ఒక మంచి పాత్ర‌లో క‌నిపిస్తారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ పాత్ర కూడా ఆక‌ట్టుకుంటుంది. త‌మ‌న్ మ్యూజిక్‌తో పాటు జీకే విష్ణు విజువ‌ల్స్ కూడా ఈ సినిమాకి మెయిన్ అసెట్‌. రియ‌ల్ ఇన్స్‌డెంట్స్‌, రియ‌ల్ క్యారెక్ట‌ర్స్ తీసుకొని చేసిన సినిమా ఇది.

ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడితే ఇమ్మిడియెట్‌గా మ‌రో సినిమా ఉంటుందా?

డెఫినెట్‌గా ఉంటుంది..

ఈ పండుగ‌కి కాంపిటేష‌న్ ఎలా ఫీల‌వుతున్నారు?

మ‌నం ప్ర‌తి సంక్రాంతికి చూస్తూనే ఉన్నాం. సినిమా బాగుంటే అన్ని సినిమాలు ఆడుతాయి. ఎందుకంటే ఒక సినిమా చూశాక మ‌రో సినిమా చూడ‌ను అని ఎవ‌రూ అనుకోరు. అన్ని సినిమాలు చూస్తారు.. పండుగంటే అదే క‌దా..

మీరు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేశారు కదా..మీ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యాం అని ఎవరైనా పోలీసులు చెప్పారా?

ఎప్పుడైనా బ‌య‌ట ఈవెంట్స్‌కి వెళ్లిన‌ప్పుడు క‌లిసి విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్ట‌ర్‌కి ఫ్యాన్స్ అండీ అని చెబుతుంటారు. ఈ సినిమా త‌ర్వాత కూడా మ‌ళ్లీ అది రావ‌చ్చు అని అనుకుంటున్నాను.

మీ అబ్బాయి మ‌హాద‌న్ ని మ‌ళ్లీ ఎప్పుడు సినిమాల్లో చూడొచ్చు?

రాజాదిగ్రేట్ సినిమాలో అనిల్ ప‌ట్టుబ‌ట్టి మ‌హాద‌న్‌తో ఆ క్యారెక్ట‌ర్ చేయించాడు. త‌ను ఇప్పుడు 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఇంకా చాలా టైమ్ ఉంది. ఆ స‌మ‌యానికి వాడికి ఏది అనిపిస్తే అదే చేయ‌మ‌ని చెప్తాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి?

ప్ర‌స్తుతం ఖిలాడీ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. త‌ర్వాత ఏ సినిమా అనేది ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.