
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 76


మరో `మెగా` కాంబినేషన్‌కి రంగం సిద్ధమవుతోందా?


వారసుల పేర్లతో... తండ్రుల స్క్రీన్ నేమ్స్...

షూటింగ్ పూర్తి అయిన మహర్షి మూవీ

సూపర్ స్టార్ కృష్ణ ‘మహాబలుడు’కి 50 ఏళ్ళు

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

వాల్మీకి లాంగ్ షెడ్యూల్ లో వరుణ్

ఆకాశవాణి షూటింగ్ పూర్తి

భీష్మ సెకండ్ హీరోయిన్ పై డైరెక్టర్ క్లారిటీ

హీరో నితిన్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్

చిత్రలహరి టీమ్ కు పవన్ అభినందనలు

దర్బార్ మూవీ లో బాలీవుడ్ విలన్

నాగచైతన్యతో `ఆర్ ఎక్స్ 100` డైరెక్టర్?

‘మజిలీ’ రీమేక్‌లో ధనుష్?

తెలుగు యవనికపై చెరగని సౌందర్యం

కాంచన3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

విజయ్ సినిమాలో తమిళ టీవీ నటి

నాని మల్టీ స్టారర్ మూవీ కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ వ్యూహం రూపొందనున్న విషయం తెలిసిందే. జూలై నెలలో సెట్స్ పైకి వెళ్ళే వ్యూహం మూవీ కి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఎంపికయ్యారు. ఈ మూవీ లో అదితి రావు హైదరి, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరో `మెగా` కాంబినేషన్‌కి రంగం సిద్ధమవుతోందా?
ఖైదీ నంబర్ 150తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… ఆ సినిమాతో తన ఖాతాలో మరో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన… హిస్టారికల్ డ్రామా సైరా నరసింహారెడ్డితో బిజీగా ఉన్నారు. సైరా చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో… కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాని చేయనున్నారు చిరు. జూన్ నుంచి ఈ మూవీ పట్టాలెక్కనుందని టాక్. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిరు తదుపరి ప్రాజెక్ట్స్ ఉంటాయని ఆ మధ్య వార్తలు వినిపించాయి.

‘మజిలీ’, ‘చిత్రలహరి’, ‘జెర్సీ’... ప్రతీ వారం అలరిస్తున్న తండ్రీకొడుకుల అనుబంధం
జీవితంలో ఒక్కసారి కింద పడి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే… అటువంటి జీవితంలో చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. అంతేకాదు అటువంటి జీవితం నలుగురికి ఆదర్శం అవుతుంది. సరిగ్గా అటువంటి లూజర్స్ టు విన్నర్స్ కాన్సెప్ట్‌తో తయారైన చిత్రాలే ‘మజిలీ’, ‘చిత్రలహరి’, ‘జెర్సీ’. ఏప్రిల్ 5న విడుదలైన ‘మజిలీ’, ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘చిత్రలహరి’లో ఈ కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అయి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. అంతేకాదు… ఇదే ఛాయలతో ఈ శుక్రవారం విడుదల కానున్న ‘జెర్సీ’కూడా తెరకెక్కిందన్నది ట్రైలర్‌ని బట్టి ఇట్టే అర్థమవుతోంది.

వారసుల పేర్లతో... తండ్రుల స్క్రీన్ నేమ్స్...
“ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాక నన్ను జడ్జ్ చేయంది నా కొడుకు ఒక్కడే… వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను”… ఇది ‘జెర్సీ’ సినిమాలో డైలాగ్. అవడానికి సినిమా డైలాగే అయినా నూటికి నూరు పాళ్ళు ప్రతీ తండ్రి మనసులో ఉండే మాటే ఇది. అందుకే ప్రతీ తండ్రి తను సాధించిన ప్రతీ విజయంలోనూ కొడుకుని కూడా భాగస్వామిని చేస్తాడు. ఈ విషయంలో సినీ తారలు ఏమాత్రం మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో వారి స్టార్‌డమ్‌ను తమ తనయులకు పరోక్షంగా ఆపాదించడానికి ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. అదెలాగంటే… తమ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్‌గా చేసుకుని కొంతమంది ప్రముఖ కథానాయకులు తెరపై సందడి చేశారు.

షూటింగ్ పూర్తి అయిన మహర్షి మూవీ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహర్షి మూవీ షూటింగ్ పూర్తి అయింది . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై రూపొందుతున్న మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి మే నెల 9వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సూపర్ స్టార్ కృష్ణ ‘మహాబలుడు’కి 50 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ… హీరోగా ప్రభంజనం సృష్టిస్తున్న రోజులవి. ఓ పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో నటిస్తూనే… మరోపక్క థ్రిల్లర్ సబ్జెక్ట్‌లోనూ తన హవా చాటుతున్నారు. అటువంటి సమయంలో ‘మహాబలుడు’ వంటి జానపద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. కృష్ణకి జోడీగా వాణిశ్రీ (త్రిపాత్రాభినయం) నటించిన ఈ సినిమాలో రాజబాబు, త్యాగరాజు, రావికొండలరావు, లక్ష్మి ముఖ్య భూమికలు పోషించగా… నాగయ్య, గీతాంజలి అతిథి పాత్రల్లో మెరిసారు.

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
సినిమా రిలీజ్ కు ముందే మంచి అంచనాలను సంపాదించుకుంది జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రికెటర్ గా.. ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారిగా జరిగినట్టు తెలుస్తోంది. మరి ఏయే ఏరియాలో ఎంత బిజినెస్ జరిగిందో చూద్దాం…

వాల్మీకి లాంగ్ షెడ్యూల్ లో వరుణ్
హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ మూవీ జిగర్తాండ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే…గత నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుగుతుంది. ఇక ఈషెడ్యూల్ లో మెగా హీరో వరుణ్ తేజ్ పాల్గొంటున్నాడు. సుమారు 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనున్నట్టు తెలుస్తోంది.

ఆకాశవాణి షూటింగ్ పూర్తి
రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ఆకాశవాణి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దగ్గర చాలా సినిమాలకు పనిచేసిన కార్తికేయ 'షోయింగ్ బిజినెస్' పేరుతో సొంత బేనర్ స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇక గత కొద్దికాలంగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పక్కా ప్లానింగుతో ముందుగా అనుకున్న ప్రకారం చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమాను షూటింగ్ ను పూర్తి చేశారు.

భీష్మ సెకండ్ హీరోయిన్ పై డైరెక్టర్ క్లారిటీ
‘హలో’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ రీసెంట్ గా చిత్రలహరి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా కళ్యాణి నితిన్ సినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న వస్తున్న సంగతి కూడా విదితమే.

హీరో నితిన్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్
సూపర్ హిట్ మూవీ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం లో భీష్మ మూవీ, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక మూవీ, దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం లో ఒక మూవీ ఇలా పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నితిన్ బిజీగా ఉన్నారు. భీష్మ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక కథానాయిక.

చిత్రలహరి టీమ్ కు పవన్ అభినందనలు
ఎన్నో సినిమాల పరాజయం తరువాత మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ కు చిత్రలహరి సినిమా తో మంచి విజయం దక్కింది. ఈనెల 12వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈసినిమా జోరు కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 20 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా ముందు ముందు కూడా ఇదే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

పాట చిత్రీకరణలో`96`రీమేక్
తమిళంలో ఘనవిజయం సాధించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్96ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రని తెలుగులో శర్వానంద్ చేస్తుండగా… త్రిష నటించిన పాత్రలో సమంత దర్శనమివ్వనుంది. ఒరిజనల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్… తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు.

‘మన్మథుడు 2’ కోసం మళ్ళీ బరువు పెరగనున్న రకుల్
‘కింగ్’ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మన్మథుడు’(2002)కి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోంది. నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమా…. ప్రస్తుతం పోర్చుగల్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో నాగార్జున, రకుల్, ‘వెన్నెల’ కిషోర్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.ఇదిలా ఉంటే… ‘మన్మథుడు2’ కోసం రకుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… ఆ మధ్య ‘దే దే ప్యార్ దే’ అనే హిందీ చిత్రం కోసం దాదాపు 10 కిలోల బరువు తగ్గింది రకుల్.

దర్బార్ మూవీ లో బాలీవుడ్ విలన్
ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో దర్బార్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న దర్బార్ మూవీలో 25సంవత్సరాల తరువాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక కాగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

నాగచైతన్యతో `ఆర్ ఎక్స్ 100` డైరెక్టర్?
ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు అజయ్ భూపతి. పరిమిత బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమాని… యువతరానికి నచ్చేలా రూపొందించి సంచలన విజయం సాధించిన వైనం అప్పట్లో పరిశ్రమలో చర్చనీయాంశంగా నిలచింది. ఈ నేపథ్యంలో… అజయ్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ మధ్య పలువురు యువ కథానాయకుల కాంబినేషన్స్‌లో అజయ్ పేరు వినిపించినా… ఇప్పటివరకు తన రెండో చిత్రం పట్టాలెక్కలేదు.

‘మజిలీ’ రీమేక్‌లో ధనుష్?
“పెళ్లికి ముందు ఉండే ప్రేమ… పెళ్లి తర్వాత బాధ్యతగా మారుతుంది” అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు… నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. తెలుగునాట ఘన విజయం సాధించిన ఈ సినిమాను… ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తెలుగు యవనికపై చెరగని సౌందర్యం
సౌందర్య… నిన్నటి తరం అందమైన సినీ జ్ఞాపకం. అందం, అభినయం మెండుగా ఉన్న అందాల తార ఆమె. ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి… ఆ పాత్రకే వన్నె తెచ్చే నటన ఆమె సొంతం. ఇక భావోద్వేగ సన్నివేశాల్లో అయితే సౌందర్య నటన అపూర్వం, అద్వితీయం. అందుకే… తెలుగు సినీ ప్రేక్షకులు ఆమెను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు.

కాంచన3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు
లారెన్స్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ముని సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆతరువాత ఆ సినిమా సీక్వెల్ లో కాంచన, గంగ సినిమాలు తెరకెక్కించగా.. అవి కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆ సీక్వెల్ లో భాగంగానే కాంచన 3 అనే సినిమాను తెరకెక్కించాడు లారెన్స్. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్ర యూనిట్.

విజయ్ సినిమాలో తమిళ టీవీ నటి
ఒక పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కొత్తగా నిర్మాత అవతారం కూడా ఎత్తిన సంగతి తెలిసిందే. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి.. తన ప్రొడక్షన్ హౌస్ లో మొదటగా.. పెళ్లి చూపులు సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో సినిమా చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.