
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 34


స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా ఎవరు టీజర్
కామ్రేడ్ గీతం విడుదల
విజయ్ ను బీట్ చేసిన నాని
దశ తిరిగింది
వెబ్ సిరీస్‌లో భూమిక

కొత్త తరహా పాత్రలో అఖిల్

హాకీ కోచ్‌గా మెగాస్టార్ చిరంజీవి?

శర్వా కొత్త సినిమాలో కన్నడ భామ
జెర్సీ తమిళ్ రైట్స్ రానా చేతికి
ఫిజియోథెరపి స్టూడెంట్‌గా నయనతార

మహేష్ - వంశీపైడిపల్లి తనయల ఛాలెంజ్

'ఎవరు' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
మహేష్ బాబు మనసులో మాట
మిస్టర్ కేకే లో హైలెట్ అదేనట..!
జులై , ఆగస్ట్ నెలలలో మూవీ మేళా

గ్యాంగ్ లీడర్ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుండగా... అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా ఎవరు టీజర్
వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో 'ఎవరు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చాలా సీక్రెట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన చిత్రయూనిట్... రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. మొదట ఆగష్ట్ 23వ తేదీన రిలీజ్ చేద్దామనుకొని ఆ తరువాత ఆగష్ట్ 15వ తేదీకి మార్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు స్టార్ హీరోయన్ సమంత చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
సరిలేరు నీకెవ్వరు - రిక్వెస్ట్ వల్లే తప్పుకున్న జగ్గూభాయ్..!
మహర్షి సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్... ఇప్పుడు అదే జోష్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కాశ్మీర్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో జగపతిబాబు తప్పుకున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. మొదట తనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చెప్పిన సన్నివేశాలు.. తను షూటింగ్ లో పాల్గొన్న తరువాత సన్నివేశాలను మార్చడంతో జగపతి బాబు సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక జగపతిబాబు ప్లేస్ లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు.

కళ దైవదత్తమే అయినా దానికి శిక్షణ అవసరం- ఎస్ వి కృష్ణారెడ్డి
“నటన అనే కళ దైవదత్తమే అయినప్పటికీ దానికి శిక్షణ అవసరం. అలాంటి నటనలో మంచి శిక్షణ ఇచ్చే "మయూఖ టాకీస్" యాక్టింగ్ స్కూల్ స్థాపించి మొదటి బ్యాచ్ కి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి ఈరోజు రెండవ బ్యాచ్ క్లాసులను ప్రారంభిస్తున్న నటుడు, రచయిత, యాక్టింగ్ కోచ్ ఉత్తేజ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు"- అన్నారు ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణారెడ్డి. ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడ లోని మయూఖ యాక్టింగ్ స్కూల్ సెకండ్ బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ వి కృష్ణారెడ్డి “ నటుడు అనేవాడు తన మాతృభాష కే పరిమితం కాకుండా వీలైనన్ని ఇతర భాషలను కూడా…
కామ్రేడ్ గీతం విడుదల
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పన లో చైతన్య ప్రసాద్ రచించిన, స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, విజయ్…
విజయ్ ను బీట్ చేసిన నాని
విజయ్ ను నానీ బీట్ చేయడం ఏంటీ.. ఏ విషయంలో నాని విజయ్ ను బీట్ చేశాడు అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. ఇక తన బోల్డ్ యాటిట్యూడ్ తో.. వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.
దశ తిరిగింది
స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది ఈ మూవీ సక్సెస్ తో నవీన్ పోలిశెట్టి ని అదృష్ట దేవత వరించింది. ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ ASSA తరువాత నవీన్ హీరోగా పిట్టగోడ మూవీ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందే…
వెబ్ సిరీస్‌లో భూమిక
హీరోయిన్ పాత్రల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలకు షిప్ట్ అయిన నిన్నటి తరం అగ్ర కథానాయిక భూమికా చావ్లా... త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో దర్శనమివ్వనుంది. `భ్రమ్` అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా... ఓ కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ వెబ్ సిరీస్... సిమ్లా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. సింహభాగం చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం. సంజయ్ సూరి, ఓంకార్ కపూర్, ఐజాజ్ ఖాన్ తదితరులు ఈ సిరీస్‌లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి... వెండితెరపై నటిగా…

కొత్త తరహా పాత్రలో అఖిల్
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో భాగంగా... అఖిల్ తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అఖిల్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే... ఇందులో అఖిల్ ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడట. భావోద్వేగాలకు అవకాశమున్న ఆ…

హాకీ కోచ్‌గా మెగాస్టార్ చిరంజీవి?
తాజాగా తన కలల ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`ని పూర్తిచేసిన మెగాస్టార్ చిరంజీవి... ప్రస్తుతం తన 152వ చిత్రంపై దృష్టి సారించారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించనున్న ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నారని ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు... రైతుగా, ఎన్నారైగా చిరు ఆ పాత్రల్లో కనిపిస్తాడని కూడా కథనాలు వచ్చాయి.

శర్వా కొత్త సినిమాలో కన్నడ భామ
శర్వానంద్ నటించిన రణరంగం సినిమా రిలీజ్ కు దగ్గరలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీనితో పాటు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో 96 సినిమా రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. శర్వానంద్ భుజానికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో 96 షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలతో పాటు శర్వానంద్ ఇటీవలే మరో కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
జెర్సీ తమిళ్ రైట్స్ రానా చేతికి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత ఎమోషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ద బెస్ట్ హిట్ దక్కింది జెర్సీతో. కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈసినిమా తమిళ్ లో కూాడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రీమేక్ హక్కులు దక్కించుకుంది ఏ తమిళ్ నిర్మాతో కాదు.. మన టాలీవుడ్ హంక్ రానా. తమిళంలో రానా నిర్మాతగా జెర్సీ రీమేక్ అవుతుందట. ఓ కొత్త డైరక్టర్ తో జెర్సీ తమిళ రీమేక్ ప్లాన్ చేశాడట. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్.. నాని పాత్రను పోషిస్తారని సమాచారం…
ఫిజియోథెరపి స్టూడెంట్‌గా నయనతార
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న కథానాయిక నయనతార. ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ లేడీ సూపర్ స్టార్... ఇప్పుడు మరో కొత్త తరహా పాత్రలో నటిస్తోందట. ఇంతకీ ఆ పాత్ర ఏమిటంటే... ఫిజియోథెరపి స్టూడెంట్. కాస్త వివరాల్లోకి వెళితే... విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో `బిగిల్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ తమిళ చిత్రంలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనుండగా... నయన్ ఫిజియోథెరపి స్టూడెంట్‌గా దర్శనమివ్వనుందట. అయితే, నయన పాత్ర పరిధి తక్కువే అయినా... చాలా వైవిధ్యంగా ఉంటుందని కోలీవుడ్…

శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి సేమ్ ఫార్ములా
యువ కథానాయకుడు శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే `రణరంగం`, `96` రీమేక్, `శ్రీకారం`. ఆసక్తికరమైన విషయమేమిటంటే... వీటిలో రెండు సినిమాలు ఒకే టైమ్ పిరియడ్ చుట్టూ తిరిగే కథలు కావడం విశేషం. `రణరంగం` 90ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ పిరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కితే... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `96` రీమేక్‌కి కూడా 90ల టచ్ ఉంటుంది. అంటే... ఈ ఏడాదిలో శర్వానంద్ నుంచి వస్తున్న బ్యాక్ టు బ్యాక్ మూవీస్... 90ల నేపథ్యంతో వస్తున్నాయన్నమాట. మరి... ఈ పిరియాడిక్ టచ్ శర్వానంద్‌కి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి. శర్వానంద్‌కి…

మహేష్ - వంశీపైడిపల్లి తనయల ఛాలెంజ్
మహేష్-వంశీ పైడిపల్లి కూతుర్లు ఏంటీ.. ఛాలెంజ్ ఏంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆధ్య ఇద్దరూ కలిసి ఆధ్య అండ్ సితార అనే కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. దీనిలో భాగంగా.. త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే గేమ్ ను ఆడారు. ఈ గేమ్ లో ఎవరు గెలిచారో చూడాలంటే మాత్రం కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయాల్సిందే.

'ఎవరు' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న టాలెంటెడ్ హీరో అడివి శేష్. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో తాను ప్రధాన పాత్రలో 'ఎవరు' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేశాడు. మొదట ఈ సినిమాను ఆగష్ట్ 23వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తరువాత ఆగష్ట్ 15వ తేదీకి మార్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. జులై 19వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మన్మథుడు 2 - సాలిడ్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఇక ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. అన్ని కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసి ఎట్టి పరిస్థితిల్లోనూ ఆగష్ట్ 9నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
మహేష్ బాబు మనసులో మాట
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు ఎంటరయి , రాజకుమారుడు మూవీ తో హీరో గా మారిన మహేష్ బాబు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.
మిస్టర్ కేకే లో హైలెట్ అదేనట..!
రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కందరం కొండన్. తెలుగులో ‘మిస్టర్ kk’ అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న విక్రమ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
జులై , ఆగస్ట్ నెలలలో మూవీ మేళా
రేపటి నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు మాస్ , యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ వంటి డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ సందడి చేయనున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ జులై 18 వ తేదీ, భరత్ కమ్మ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ జులై 26వ తేదీ రిలీజ్ కానున్నాయి. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటించిన గుణ 369 మూవీ ఆగస్ట్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.