
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 33

సరిలేరు నీకెవ్వరు - మొదటి షెడ్యూల్ పూర్తి

ఎవరు టీజర్ రిలీజ్

ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ "డబుల్ ఇస్మార్ట్"

ధనుష్ కు జోడీగా మలయాళీ భామ

అజయ్ భూపతి, రవితేజ మూవీ అక్టోబర్ లో ప్రారంభం
థ్యాంక్స్ జగపతిబాబుగారు అర్థం చేసుకున్నారు

కాప్పాన్ (బందోబస్త్ ) మూవీ ఆడియో రిలీజ్ డేట్

భాగ్యనగరంలో ‘వెంకీమామ’

‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ అప్‌డేట్

యూట్యూబ్‌లోనూ సంచలనం సృష్టిస్తున్న ‘ఎఫ్ 2’

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్

సాహో మూవీ ఆగస్ట్ 30వతేదీ విడుదల

ఈసారి డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్న పూరీ

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్

`డియర్ కామ్రేడ్`... రన్ టైమ్ డిటైల్స్
వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. అతి త్వరలో ఈ యూత్ ఐకాన్ `డియర్ కామ్రేడ్`గా పలకరించబోతున్నాడు. స్టూడెంట్ పాలిటిక్స్, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలతో... ఓ యువకుడి లైఫ్ జర్నీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందించాడు. విజయ్‌కి జోడీగా రష్మిక నటించింది. `గీత గోవిందం` తరువాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే.
సరిలేరు నీకెవ్వరు - మొదటి షెడ్యూల్ పూర్తి
అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. గత కొద్ది రోజులు ఈసినిమా కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజే ముగిసింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని.. మహేష్ బాబుగారితో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక రెండవ షెడ్యూల్ ఈ నెల 26 నుండి హైదరాబాద్ సిటీలో జరగనున్నట్టు తెలుస్తోంది.
మృత్యు ముఖాన్ని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి
"జాతస్య మరణం ధృవం"- అంటారు. మనిషి పుట్టినప్పుడే మరణం కూడా ధ్రువీకరించబడి ఉంటుందట. మధ్యలో మనం ఎన్ని చేసినా, ఎంత చేసినా మృత్యువన్నది వచ్చే ఏ సమయానికే వస్తుంది... తీసుకుపోతుంది. అందుకే చావు గురించి మనసు కవి ఆత్రేయ చక్కని చమత్కారం ఒకటి విసిరేవారు." చావుకు నేనంటే చచ్చే భయం.... నేను బతికున్నంత వరకు అది నా దగ్గరికి రాదు... అది వస్తే నేను బతికి ఉండను" అని. ప్రస్తుతం ఈ మృత్యు ప్రస్తావన ఎందుకు? ఏమిటి? అనుకుంటున్నారు కదూ. తీవ్ర అస్వస్థతకు గురై దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండి మృత్యు ముఖాన్ని ముద్దాడి ప్రాణాపాయం నుండి తప్పించుకుని క్షేమంగా ఇంటికి వచ్చిన ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ…

ఎవరు టీజర్ రిలీజ్
క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న శేష్ ఇప్పుడు ఎవరు అనే మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేసిన శేష్ సినిమా రిలీజ్ ను కూడా ఫాస్ట్ గానే చేసేస్తున్నాడు. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ "డబుల్ ఇస్మార్ట్"
పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) నిర్మాణ సారథ్యంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ 18 వ తేదీ రిలీజయి విజయం సాధించింది. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్,టీజర్, ట్రైలర్స్ తోనే హైప్ క్రియేట్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజయిన మొదటి షో తోనే పాజిటివ్ సొంతం చేసుకొని, రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 7. 83 కోట్లు షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ధనుష్ కు జోడీగా మలయాళీ భామ
ఇటీవల రజనీకాంత్ హీరోగీ పేట సినిమాను తెరకెక్కించిన కార్తిక్ సుబ్బరాజ్.. ఇప్పుడు అల్లుడితో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో తెరకెక్కాల్సింది కానీ.. సుబ్బరాజ్ మెర్క్యురి, పేట సినిమాలు చేయడంతో ధనుష్ ప్రాజెక్ట్ కాస్త లేటయింది. ఫైనల్లీ ఇప్పుడు ఈసినిమా తెరకెక్కనుంది. ఇటీవలే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈసినిమాను ఆగష్ట్ లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

అజయ్ భూపతి, రవితేజ మూవీ అక్టోబర్ లో ప్రారంభం
RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన అజయ్ భూపతి తన రెండవ చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాస్ మహారాజ హీరో గా ఎంపికయ్యారు. హై ఎమోషనల్, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పరిణతి చెందిన ప్రేమకథ గా రూపొందనున్న ఈ మూవీ లో మరో మేల్ లీడ్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కు హీరో సిద్ధార్ధ్ ను ఎంపిక చేసారని ఎంపిక చేసారని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమయితే హీరో సిద్ధార్ధ్ కు 6సంవత్సరాల తరువాత టాలీవుడ్ లో కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. హీరో రవితేజ కు జోడీ గా అదితి రావు హైదరీ సెలెక్ట్ అయ్యారు. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.
థ్యాంక్స్ జగపతిబాబుగారు అర్థం చేసుకున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం కశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించనున్న జగపతిబాబు సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే ప్రకాష్ రాజ్ కోసం మహేష్ బాబు, అనిల్ రావిపూడి రిక్వెస్ట్ తోనే జగ్గూభాయ్ తప్పుకున్నట్టు కూడా కథనాలు వచ్చాయి. ఇక తాాజాగా ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించి తన ట్విట్టర్ ద్వారా జగపతిబాబుకు థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.
ఇస్మార్ట్ శంకర్ట్ ఫస్ట్ డే దిమ్మ తిరిగే కలెక్షన్స్
ఇస్మార్ట్ శంకర్.. డబల్ దిమాక్.. ఈ సినిమా ఒక్కసారిగా అటు పూరీని, రామ్ ని, నిధి అగర్వాల్ ని, నభా నటేష్ ని ఫామ్ లో తెచ్చేసింది. అంతేకాకుండా.. ఇన్ని రోజులు రాని అవకాశం..ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందో.. మణిశర్మ తన మ్యూజిక్ తో చూపించాడు. అదిరిపోయే సంగీతాన్ని అందించి.. సినిమాకే హైలెట్ అయ్యాడు. నిన్న విడుదలైన ఈ సినిమాను చూసిన వారందరూ.. పూరీ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఫస్ట్ షో నుండే మంచి టాక్ సొంతం చేసుకునన ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు సైతం దక్కని విధంగా ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టి అందరికీ షాకిస్తుంది. దీంతో పూరీ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. మొదటి రోజు…

కాప్పాన్ (బందోబస్త్ ) మూవీ ఆడియో రిలీజ్ డేట్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై KV ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన కాప్పాన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ బందోబస్త్ సెప్టెంబర్ 13 వ తేదీ విడుదల కానున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్య, సాయేషా, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. హీరో సూర్య 37 వ మూవీ గా రూపొందిన కాప్పాన్ మూవీ సూర్య,KV ఆనంద్ కాంబినేషన్ లో మూడవది.

'నిన్నే పెళ్లాడతా' అంటున్న రకుల్ బ్రదర్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడింది. అమన్ సింగ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ వైకుంఠ బోను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్.

బిగ్ బాస్ 3 పోస్ట్ పోన్ కానుందా ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2 ను హీరో నాని రసవత్తరంగా నడిపారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్. జులై 21 వ తేదీ నుండి ప్రసారం కానుంది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్త సెక్సువల్ హెరాస్ మెంట్, మోసం గురించి ఆ షో నిర్మాతలపై ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితులలో బిగ్ బాస్ 3 ప్రోగ్రామ్ ను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా నాగార్జున నిర్మాతలను కోరారు.

భాగ్యనగరంలో ‘వెంకీమామ’
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను కె.ఎస్.రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని సమాచారం.

‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ అప్‌డేట్
ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మల్టీలింగ్వల్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండేతో పాటు హాలీవుడ్ నటుడు మైఖెల్ మేడ్‌సన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి... హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.

యూట్యూబ్‌లోనూ సంచలనం సృష్టిస్తున్న ‘ఎఫ్ 2’
గత కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా హిందీలోకి అనువదింపబడుతున్న పలు తెలుగు చిత్రాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. వాటిలో సింహభాగం యాక్షన్ మూవీస్‌దే హవా కాగా... ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ కామెడీ ఎంటర్‌టైనర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆ చిత్రమే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా, పంజాబీ భామ మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి పలు భారీ చిత్రాల నడుమ విడుదలై ఘన విజయం సాధించిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి…

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్
అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్... ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే కరణ్ జోహార్ నిర్మాణంలో ‘కార్గిల్ గాళ్’లో నటిస్తున్న జాన్వి... ఆ తరువాత కూడా కరణ్ జోహార్ నిర్మాణంలోనే ‘దోస్తానా 2’లో కథానాయికగా నటించనుంది. అలాగే... కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హిస్టారికల్ డ్రామా ‘తఖ్త్’లోనూ కీలకపాత్ర పోషించనుంది జాన్వి. అంతేకాదు... కరణ్ జోహార్ నిర్మించనున్న మరో చిత్రంలోనూ జాన్వి నాయికగా నటించనుందని సమాచారం. బేజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో తన ఫస్ట్ మూవీ హీరో ఇషాన్…

సాహో మూవీ ఆగస్ట్ 30వతేదీ విడుదల
UV క్రియేషన్స్, T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెలుగు తమిళ హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కావాల్సివుంది. కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ ఆగస్ట్ 30 వ తేదీ కి మారింది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ దుబాయ్ , అబుదాబి లో చిత్రీకరించిన యా క్షన్ సీన్స్ సాహో మూవీ కి హై లైట్. ఈమూవీ లోని సైకో సయ్యా సాంగ్ రిలీజయి ప్రేక్షకాదరణ పొందింది.

బ్యాక్ టు బ్యాక్ వీక్స్‌లో `ఆర్ ఎక్స్ 100` సెన్సేషన్ సందడి
గత ఏడాది సంచలనం ‘ఆర్ ఎక్స్ 100’తో సంగీత దర్శకుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్ భరద్వాజ్. ముఖ్యంగా `పిల్లా రా` పాటతో యువతరాన్ని ఉర్రూతలూగించాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ తరువాత థ్రిల్లర్ ఫిలిమ్ ‘7’లో మరోసారి తన బాణీలతో అలరించాడు ఛైతన్. ‘ఆర్ ఎక్స్ 100’, `7`కి మధ్య దాదాపు 11 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ యువ సంగీత సంచలనం... ఇప్పుడు వారం రోజుల గ్యాప్‌లోనే రెండు చిత్రాలతో సందడి చేయనున్నాడు. ఆ సినిమాలే `గుణ 369`, `మన్మథుడు 2`.

ఈసారి డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్న పూరీ
ఒకపక్క డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. మరోపక్క యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది.. ఎలా ఉంటుంది ఇస్మార్ట్ శంకర్ లా ఉంటుంది అని చెప్పొచ్చు.. ఈసినిమా చూసిన తరువాత. పూరీ డైలాగ్స్ కు రామ్ మాస్ యాక్షన్ కలిసే ఇలా ఉంటుందా అని అర్ధమైంది అందరికీ. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. శంకర్ పాత్రలో రామ్ జీవించాడన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అంతే కాదు ఈసినిమాతో పూరీ, మణిశర్య ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు.

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్
మొత్తానికి జూన్ నెల మాత్రం వరుస సినిమా రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ ఒక్క జూన్ లోనే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక జూన్ 26వ తేదీన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిలీజ్ అయిపోతే ఈ నెల వాటా అయిపోయినట్టే. వచ్చే నెల మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈరోజు ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఈనెల విడుదలైన లేటెస్ట్ సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం..