విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుండగా… అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ ను జులై 24వ తేదీ రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు. ఆ తరువాత పాటలు, ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
కాగా ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.ఆగష్ట్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=idr0VLeZvMQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: