
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 32


పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’కు 21 ఏళ్ళు

చిరు ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’కు 17 ఏళ్ళు

గ్యాంగ్ లీడర్ టీజర్ రిలీజ్

మారిన వాల్మీకి రిలీజ్ డేట్

విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన కొత్త ట్రెండ్

శివరంజని మూవీ రిలీజ్ డేట్

మరోసారి బాలయ్య సినిమాలో సోనాల్ చౌహాన్?

ఆకట్టుకుంటున్న ‘మన్మథుడు 2’ ఫస్ట్ సింగిల్

సమంత లక్ 'ఎవరు' కి కలిసొస్తుందా..?

ఫిల్మ్‌మేకర్‌గా రాశీ ఖన్నా

శేఖర్ కమ్ముల ‘ఫిదా’కు రెండేళ్ళు
'నిశ్శబ్ధం' ఫస్ట్ లుక్ రిలీజ్

హీరోయిన్ సంగీత టాలీవుడ్ లో రీఎంట్రీ
తమిళ, మలయాళ మూవీస్ హీరోయిన్ సంగీత ఆశల సందడి మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ ఖడ్గం మూవీ తో గుర్తింపు పొందారు. ఖడ్గం మూవీ లో పెర్ ఫార్మెన్స్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సంగీత ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. పెళ్ళాం ఊరెళితే, శివపుత్రుడు వంటి మూవీస్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చారు. 9సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీ తో టాలీవుడ్ లో సంగీత రీ ఎంట్రీ ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’కు 21 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌లా నిలచిన చిత్రం `తొలిప్రేమ`. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు ఎ.కరుణాకరన్ డైరెక్టర్‌గా తొలి అడుగులు వేశాడు. పవన్‌కి జోడీగా కీర్తి రెడ్డి నటించిన ఈ చిత్రంలో... వాసుకి, సంగీత, నర్రా వెంకటేశ్వరరావు, నగేష్, అచ్యుత్, అలీ, వేణుమాధవ్, పీజే శర్మ, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీత రచన చేసిన పాటలకు... దేవా అద్భుతమైన స్వరాలు సమకూర్చారు.

చిరు ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’కు 17 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో పలు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘ఇంద్ర’ ఒకటి. భారీ బడ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్... తమ సంస్థ వైజయంతీ మూవీస్ సిల్వర్ జూబ్లీ ఇయర్స్‌ను పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘చూడాలని వుంది!’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత చిరు, అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. బి.గోపాల్ పుట్టినరోజు కానుకగా విడుదలైన `ఇంద్ర... అతని కెరీర్‌లో మెమరబుల్…

గ్యాంగ్ లీడర్ టీజర్ రిలీజ్
మనం, హలో ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ తుది దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మారిన వాల్మీకి రిలీజ్ డేట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన కొత్త ట్రెండ్
సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ తాను నటించిన మూవీస్ ను తన సొంత స్టైల్ లో ప్రమోట్ చేస్తూ, మార్కెట్ వేల్యూ పెంచుతున్నారు. డియర్ కామ్రేడ్ మూవీ తో విజయ్ దేవరకొండ ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మ్యూజిక్ ఫెస్టివల్ పేరు తో చిత్ర యూనిట్ తో నాలుగు నగరాలలో ఈవెంట్స్ ను నిర్వహించి కొత్తపద్ధతి లో డియర్ కామ్రేడ్ మూవీ ని ప్రమోట్ చేశారు.

శివరంజని మూవీ రిలీజ్ డేట్
హోలీ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన రష్మీ గౌతమ్ పలు తెలుగు, తమిళ మూవీస్ లో నటించారు. తన అందచందాలు, హావభావాలతో నవ్వుతూ, నవ్విస్తూ బుల్లితెర ప్రేక్షకులను కవ్విస్తూ, జబర్దస్త్, ఢీ వంటి ప్రోగ్రామ్స్ తో సక్సెస్ ఫుల్ యాంకర్ గా వెలుగొందుతున్న రష్మీ శివరంజని మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.

మహేష్ - పరశురామ్ చిత్రానికి నిర్మాతగా కొరటాల?
ఈ వేసవిలో `మహర్షి`గా మురిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు... ప్రస్తుతం తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా ఉన్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఇటీవల తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే... ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్‌పై ఉండగానే... తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మహేష్.

పూరి `జన గణ మన`లో హీరోగా విజయ్ దేవరకొండ!?
చాలా కాలంగా విజయాలకు దూరమైపోయిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్... తాజా చిత్రం `ఇస్మార్ట్ శంకర్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసాడు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న పూరి... రెండు నెలలు విశ్రాంతి తీసుకుని ఆ తరువాతే తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

మరోసారి బాలయ్య సినిమాలో సోనాల్ చౌహాన్?
నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన కథానాయికల్లో సోనాల్ చౌహాన్ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘లెజెండ్’ బ్లాక్‌బస్టర్ కాగా... రెండో చిత్రం ‘డిక్టేటర్’ డీసెంట్ హిట్ అనిపించుకుంది. కాగా... స్వల్ప విరామం తరువాత ఈ ఇద్దరు ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.

ఆకట్టుకుంటున్న ‘మన్మథుడు 2’ ఫస్ట్ సింగిల్
కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా... సీనియర్ యాక్ట్రస్ లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ ఛైతన్ భరద్వాజ్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

నవంబర్ నుంచి పట్టాలెక్కనున్న బన్నీ, బోయపాటి మూవీ!?
‘సరైనోడు’(2016)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను... మూడేళ్ల విరామం తరువాత మరోసారి జట్టుకట్టనున్నారు. ఈ సారి కూడా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ద్వయం... నాటి ‘సరైనోడు’ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తోందట. కాగా... గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

సమంత లక్ 'ఎవరు' కి కలిసొస్తుందా..?
'గూఢచారి' లాంటి యాక్షన్ డ్రామాతో హిట్ కొట్టిన అడివి శేష్ ఇప్పుడు ఎవరు అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో థ్రిల్ చేయడానికి వస్తున్నాడు. ఇక ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేసే నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ రిలీజ్ కార్యక్రమంలో అడివి శేష్ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు.

`ఇస్మార్ట్ శంకర్`కి కలిసొచ్చిన పూరి సెంటిమెంట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ నెల 18న విడుదలైన ఈ మాస్ ఎంటర్‌టైనర్... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు... మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని ట్రేడ్ టాక్. ఇదిలా ఉంటే... ఈ సినిమా విజయం సాధించడంతో దర్శకుడు పూరికున్న ఓ సెంటిమెంట్ బలపడినట్లయ్యింది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే... `ఎ` సర్టిఫికేట్‌తో రిలీజైన పూరి డైరెక్టోరియల్స్ ఘనవిజయం సాధించడం.

ఫిల్మ్‌మేకర్‌గా రాశీ ఖన్నా
`ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి... మళ్ళీ ‘తొలిప్రేమ’తోనే ఆ స్థాయి కీర్తి దక్కింది. కాగా... ప్రస్తుతం రాశి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయికగా నటిస్తోంది. ఆ చిత్రాలే... ‘వెంకీమామ’ (వెంకటేష్, నాగచైతన్య కథానాయకులు), ‘ప్రతీరోజు పండగే’ (సాయితేజ్ హీరో), విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్ మూవీ. వీటిలో నాగచైతన్యకి జోడీగా నటిస్తున్న `వెంకీమామ`నే ముందుగా తెరపైకి రానుంది. అంతేకాదు... ఇందులో ఇదివరకు తను పోషించని కొత్త తరహా పాత్రలో…

శేఖర్ కమ్ముల ‘ఫిదా’కు రెండేళ్ళు
ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, `అనామిక`... ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని కథా ఇతివృత్తాలని తెరకెక్కించి సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కమ్ముల.... `అనామిక` అనంతరం మూడేళ్ళ గ్యాప్ తీసుకుని రూపొందించిన చిత్రం ‘ఫిదా’. మలయాళ చిత్రం `ప్రేమమ్`తో దక్షిణాది వారి దృష్టిని ఆకర్షించిన `మలర్` సాయిపల్లవి ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ పోరి భానుమతిగా తన నటనతో, నర్తనంతో కుర్రకారుని `ఫిదా` చేసింది. అంతేకాదు... తొలి తెలుగు సినిమాతోనే…
'నిశ్శబ్ధం' ఫస్ట్ లుక్ రిలీజ్
‘భాగమతి’ సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు 'నిశ్శబ్ధం' అనే మరో ఇంట్రెస్టింగ్ కథతో వస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్ధం'పేరుతో.. మిగిలిన భాషల్లో సైలెన్స్ పేరుతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సస్పెన్ మెయింటైన్ చేసిన చిత్రయూనిట్...తాజాగా ఫస్ట లుక్ ను రిలీజ్ చేసింది.
జూలై సెంటిమెంట్‌ని కొనసాగించిన `ఓ బేబీ`, `ఇస్మార్ట్ శంకర్`
టాలీవుడ్‌కి అచ్చొచ్చే నెలల్లో జూలై ఒకటి. ముఖ్యంగా... ఈ నెలలో వేర్వేరు సంవత్సరాల్లో పలు ఇండస్ట్రీ హిట్స్ (`బొబ్బిలిపులి`(1982), `ఇంద్ర`(2002), `సింహాద్రి`(2003), `మగధీర`(2009), `బాహుబలి - ది బిగినింగ్`(2015)) నమోదైన వైనం ఉంది. ఇక గత ఐదేళ్ళుగా అయితే వరుసగా ఘనవిజయాలు నమోదవుతున్నాయి. `దృశ్యం` (2014), `బాహుబలి - ది బిగినింగ్` (2015), `పెళ్ళిచూపులు` (2016), `ఫిదా` (2017), `ఆర్ ఎక్స్ 100` (2018)... ఇలా గత ఐదేళ్ళలో ఏడాదికో ఘనవిజయం ఉంటే... ఈ సంవత్సరం ఆ సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ ఏకంగా రెండు బ్లాక్‌బస్టర్స్ నమోదయ్యాయి. ఆ సినిమాలే `ఓ బేబీ`, `ఇస్మార్ట్ శంకర్`.
తమన్నా ‘పెట్రోమ్యాక్స్’ ఫస్ట్ లుక్
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం `పెట్రోమ్యాక్స్`. `అదే కన్‌గళ్` (`నీవెవరో`కి మాతృక) ఫేమ్ రోహన్ వెంకటేషన్ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్... తెలుగు చిత్రం `ఆనందో బ్రహ్మ` (2017) ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు.
ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ కేకే వైజాగ్ కలెక్షన్స్
మొత్తానికి జూన్ నెల మాత్రం వరుస సినిమా రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ ఒక్క జూన్ లోనే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక జూన్ 26వ తేదీన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిలీజ్ అయిపోతే ఈ నెల వాటా అయిపోయినట్టే. వచ్చే నెల మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. నిన్న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మంచి కలెక్షన్ల్ రాబడుతుంది. వైజాగ్ లో ఇంకా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ఈరోజు విడుదలైన మిస్టర్ కేకే సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మరి ఈ మూవీస్ ఈరోజు వైజాగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..