
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 29


ప్రారంభం అయిన #NTR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

మీట్ క్యూట్ ట్రైలర్ రిలీజ్

హను మాన్ టీజర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ టీజర్ అప్ డేట్

జైలర్ సినిమా సెట్స్ లో రజనీకాంత్ సందడి

హరిహర వీరమల్లు- సాలిడ్ ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్

సమంత ఓకే అంటే యశోద సీక్వెల్ షురూ

500 కోట్ల క్లబ్ లో పొన్నియిన్ సెల్వన్ 1

గాల్లో తేలినట్టుందే - సమంత

యాక్షన్ మోడ్ లో సలార్

మసూదకు సూపర్ పబ్లిక్ రేటింగ్

లవ్ టుడే రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రాజెక్ట్ K మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

విశ్వక్ ధమ్కీ ట్రైలర్ 1.0 రిలీజ్

18 పేజెస్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం- ఫారెస్ట్ లో చాలా కష్టపడ్డాం
అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమాలో నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నవంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.

ప్రారంభం అయిన #NTR మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది.

మీట్ క్యూట్ ట్రైలర్ రిలీజ్
దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయమవుతూ వస్తున్న సినిమా మీట్ క్యూట్. ఈ సిరీస్ ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నాని వాయిస్ ఓవర్ తో ఈసినిమా ట్రైలర్ మొదలవ్వగా.. నీకు మీట్ క్యూట్ అంటే తెలుసా? అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు.. వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు, మాటలు, ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అంటూ మొదలైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ అందించిన బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా…

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా చిరంజీవి
ప్రాణం ఖరీదు (1978) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో తెలుగు , తమిళ , హిందీ భాషలలో 150 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బెస్ట్ యాక్టర్ గా 4 నంది , 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న చిరంజీవి ని పద్మభూషణ్ పురస్కారం తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య , భోళా శంకర్ మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

హను మాన్ టీజర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు తీయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ప్రస్తుతం తను తెరకెక్కిస్తున్న సినిమా హను మాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. హను-మాన్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ముందు ఈ టీజర్ ను నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేద్దామని ప్రకటించారు. అయితే అదే రోజున సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఆయన మరణానికి…
ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ టీజర్ అప్ డేట్
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆనంద్ రీసెంట్ గా పుష్పక విమానం, ‘హైవే చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్ప్పుడు ఆనంద్ మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

జైలర్ సినిమా సెట్స్ లో రజనీకాంత్ సందడి
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్టర్, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయని సమాచారం. ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. సీనియర్ హీరోయిన్ తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హీరో రజనీకాంత్ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ మూవీ ని రెండు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్…

5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటన స్టిల్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

హరిహర వీరమల్లు- సాలిడ్ ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమా కోసం పవన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా ఇంతవరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో బిజీగా ఉండటం కూడా ఈ షూటింగ్ లేట్ అవ్వడానికి ఒక కారణమని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఒకవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరొకవైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని…

సమంత ఓకే అంటే యశోద సీక్వెల్ షురూ
మరోసారి స్టార్ హీరోయిన్ సమంత తన సత్తాను బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. హీరోయిన్స్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసినా కొంతమందికి మాత్రమే అవి కలిసొస్తాయి. అందులో సమంత ముందుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూ టర్న్, ఓ బేబి, ఇప్పుడు యశోద ఇలా వరుస విజయాలను అందుకుంటుంది. నిజానికి ఈసినిమా ప్రమోషన్స్ ను కాస్త లేట్ గా మొదలుపెట్టారు. చాలా తక్కువ టైమే ప్రమోషన్స్ కు కేటాయించారు. మరోవైపు సమంత కూడా అనారోగ్యంతో ట్రీట్ మెంట్ లో ఉంది. ఏదో రిలీజ్ కు ముందు ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చింది. కానీ రిలీజ్ కు ముందు వచ్చిన బజ్ కంటే సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకుల టాక్ తోనే ఈసినిమా సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. సమంత…

500 కోట్ల క్లబ్ లో పొన్నియిన్ సెల్వన్ 1
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష, జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

గాల్లో తేలినట్టుందే - సమంత
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ లో యశోద పాత్రలో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

యాక్షన్ మోడ్ లో సలార్
రీసెంట్ గా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వరుసగా పాన్ ఇండియా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ఒకవైపు కె.జి.యఫ్ డైరెక్టర్ మరోవైపు ప్రభాస్ హీరో కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా…

మసూదకు సూపర్ పబ్లిక్ రేటింగ్
ఇప్పుడు మేకర్స్ సినిమాలు తీసే విధానం మారిపోయింది. అలానే ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. అది దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చిన్న సినిమా అని కాదు పెద్ద సినిమా కాదు కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అది మరోసారి మసూద సినిమాతో నిరూపించారు ఆడియన్స్. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మాత్రం ఆద్యంతం సస్పెన్స్ తో…

లవ్ టుడే రిలీజ్ డేట్ ఫిక్స్
ఒక భాషలో రిలీజ్ అయిన సినిమాను మరో భాషలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే కన్నడలో సూపర్ హిట్ అయిన కాంతార సినిమాను తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ అయిన అరవింద్ రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ ను అందించింది. ఇప్పుడు మరో తమిళ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, ఇవాన జంటగా తెరకెక్కిన సినిమా లవ్ టుడే. తమిళ్ లో రూపొందించిన ఈసినిమా నవంబర్ 4 వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలిచింది.

ప్రాజెక్ట్ K మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

సెన్సార్ పూర్తి చేసుకున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. ఇక ఇప్పుడు తన సినిమాల్లో విభిన్నత మాత్రమే ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఆ అంచనాలను పెంచేశారు. ఇక ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గానే మార్చారు. ఇక రిలీజ్…

విశ్వక్ ధమ్కీ ట్రైలర్ 1.0 రిలీజ్
కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్
శ్రీ దేవి మూవీస్ బ్యానర్ పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో కృష్ణ కుమార్ , శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బాలకృష్ణ ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ సీక్వెల్ కై నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

18 పేజెస్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ను ముందే ప్రారంభించారు. కానీ కార్తికేయ2 సినిమా ముందు రిలీజ్ అయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. నన్నయ రాసిన అనే లిరికల్ పాటను రిలీజ్ చేయనున్నారు…